Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్
ఆత్మకూరు పట్టణంలోని గాంధీ చౌక్ నందు కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ నాయకులు ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు పై బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ర్యాలీగా బస్టాండ్ రోడ్డులో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల పట్టన నాయకులు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దోపిడీ రాజకీయాన్ని నిర్మూలించేందుకు ప్రజలు హిమాచల్ ప్రదేశ్లో ఘనవిజయం సాధించి పెట్టారని గుర్తుచేశారు. ఇది ఏఐసిసి కొత్తగా నియామకమైన ఘాట్కే గారికి బహుమతిగా ఆ రాష్ట్ర ప్రజలే ఇచ్చినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సోనియాగాంధీ ఆశయాలను ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బద్ధులై సమైక్యత ,ఐక్యతతో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నల్లగొండ శ్రీనివాసులు, మండల అధ్యక్షులు పరమేష్ , బాలకిష్టాన్న, కాంగ్రెస్ నాయకులు గాండ్ల రఘు, మన్యం ,ఆంజనేయులు, మొబైల్ ఖాజా, బాల గౌడ్, మేదర్ శ్రీనివాసులు, ఈర్లదిన్నె శ్రీనివాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అమరచింత : హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల అమరచింత మండల కేంద్రంలో బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బానిసంచ పేల్చి గురువారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయుబ్ ఖాన్ మాట్లాడుతూ. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ నాయకత్వంలో బీజేపీ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అరుణ్ కుమార్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు శ్యామ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు ప్రకాశం, శక్తి యాప్ మన అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు హనుమంతు నాయక్, తోఫీకు ,యాదగిరి, కురువ రఘు పలువురు పాల్గొన్నారు.