Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మౌలిక వనరులున్న ...పరిశ్రమలు సున్నా
- వనరులున్న అభివృద్ధి సున్నా
- పాలమూరులో అమర్ రాజా
- కేంద్రం సహకరిస్తే మరిన్ని పరిశ్రమలు
మహబూబ్‌నగర్ జిల్లాలో అనేక వనరులు ఉన్నప్పటికీ పరిశ్రమలు ఏర్పాటు చేయడం లేదు. ముఖ్యంగా కేంద్రం సహకరిస్తే అనేక పరిశ్రమలు జిల్లాకు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పరిశ్రమలు ఇచ్చే సూచనలు ఏమాత్రం కనబడడం లేదు. ముఖ్యంగా విమాన యానం రైల్వే నిర్మాణ సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేస్తారని అందరూ ఊహించారు. కేంద్ర ప్రభుత్వం 8 ఏండ్లుగా అధికారంలో ఉండి పాలమూరు అభివృద్ధికి ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు.అమర్ రాజా వంటి పరిశ్రమలు రావడంతో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నవ తెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డివిటి పల్లి గ్రామం వద్ద అమర్ రాజా బ్యాటరీ గ్రూప్ ఆఫ్ కంపెనీ భారీ కంపెనీని ఏర్పాటు చేసేందుకు..ఆ కంపెనీ అధినేత గల్లా జయదేవ్ ముందుకు వచ్చారు. ఈ మేరకు అమరరాజా కంపెనీ అధినేత జయదేవ్ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు. 250 ఎకరాలలో 9500 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే భారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు తెలుగుదేశంలో సుమారుగా 5000 మందికి, దశలవారీగా మొత్తం పదివేల మందికి ఉపాధి లభించే విధంగా ఈ కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. అమరరాజా బ్యాటరీల తయారీ కంపెనీ యాజమాన్యంతో ఒప్పందం కుదిరిన వెంటనే రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పర్సనల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దివిటి పల్లి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ఐటీ కారిడార్ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయని త్వరలోనే ఈ టవర్ కూడా ప్రారంభిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. ఈ టవర్‌తో పాటు హన్వాడ వద్ద ఫుట్ పార్కు కూడా ఏర్పాటు కానుందని చెప్పారు.పాలమూరు జిల్లా కేంద్రం మీదుగా జాతీయ రహదారులు, డబుల్ రైల్వే లైన్లు, ఉండడంతోపాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా సమీపంలో ఉండడం వల్ల భవిష్యత్తులో పాలమూరు ఓ గొప్ప పారిశ్రామిక వాడగా రూపొందబోతుందని ప్రకట ించారు. దీనివల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతకు భారీ ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు.
వనరులున్న అభివృద్ధి సున్నా
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు పరిశ్రమల ఏర్పాటుకు అనేక అవకాశాలు ఉన్నప్పటికీ చేయడం లేదు. నల్లమల అటవీ ప్రాంతం వేలాది ఎకరాలలో విస్తరించి ఉంది. దీని ద్వారా కాగితం పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు. కొల్లాపూర్ ప్రాంతంలో నా పరాతి నిలువలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకొని సిమెంట్ పోస్టులను ఏర్పాటు చేయవచ్చు. నారాయణపేట, గద్వాల పరిధిలో పట్టు వస్త్రాలకు సంబంధించిన చేనేత పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు. నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్ ,నారాయణపేట పరిధిలో గద్వాల జిల్లాలో కాటన్ మిల్లులు నెలకొల్పోతే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పక్కనే జాతీయ రహదారి కృష్ణానదితో పాటు యువత బలంగా ఉన్న మహబూబ్‌నగర్ లాంటి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని యువత కోరుతోంది.
పరిశ్రమల ద్వారానే యువతకు ఉపాధి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు ద్వారానే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా వనరులన్నప్పటికీ కేంద్రం పరి శ్రమల ఏర్పాటుకు పాలమూరు జిల్లాపై వివక్షచూపుతుంది. కాగితం సున్నం పరిశ్రమలతో పాటు విమాన రైల్వే తయారి కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఉమ్మడి జిల్లాకు పరిశ్రమలను అనుమతులు ఇచ్చి నెలకొల్పోవాల్సిందిగా కోరారు.
- ఎండి జబ్బార్,సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వనపర్తి