Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశల ధర్నా, వంటావార్పు
నవ తెలంగాణ-నారాయణపేట టౌన్
జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ఆశ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో 48 గంటలపాటు గురువారం ధర్నావంట వార్పు నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట రా మిరెడ్డి, బలరాం హాజరై మాట్లాడుతూ.. ఆశలకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణలో ఆశలతో ఇంకెంతకాలం వెట్టి చాకిరి చేయించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికి తగ్గ వేతనం చెల్లించా లన్నారు. కరోనా కష్టకాలంలో ఆశలు తమ ప్రాణాలకు తెగించి పనిచేశారన్నారు. అలాంటివారికి ప్రభుత్వము వేతనాలు పెంచకపోవడం దారుణమని విమర్శించా రు. లెప్రసీ, కంటి వెలుగు, ఎన్నికల విధులు ఇతరత్రా అదనపు పనులు అప్పజెప్పి ఆశలను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారన్నారు. గర్భిణు లకు, బాలింతలకు రోగులకు వైద్యం కల్పిస్తున్న ఆశల కు జిల్లా ఆస్పత్రిలో మాత్రం అవమానాలకు గురవు తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా వంటవార్పు జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఆశలు అధిక సంఖ్యలో హాజరైనట్లు తెలిపారు.
ధరూర్: జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదు ట 48 గంటలు వంటావార్పు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నిఉద్దేశించి సీఐటీయూ జిల్లా కా ర్యద ర్శి వీవీ నర్సింహా మాట్లాడుతూ.. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలందించడం లో ఆశా కార్యకర్తలు ముందు వరుసలో ఉన్నారని, కోవి డ్ కష్టకాలంలో కూడా ప్రాణాలు సైతం అడ్డువేసి వైద్యసేవలు అందించారని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీస వేతనాలు గాని ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టు ఫిక్స్డ్ వేతనం గాని అమలు చేయకుండా విపరీతమైన పనిభారం మోపి వెట్టిచాకిరి గురి చేస్తున్నారన్నారు. పారితోసికం ఇవ్వని పనులు కూడా ఆశలతో చేయిస్తున్నారని పెంచిన 30శాతం ఏరియాస్ ఇప్పటివరకు ఇవ్వలేదని అలాగే డ్రస్ అలవెన్స్లు కోవిడ్ ఇన్సెంటివ్ ప్రమాదబీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పిం చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనం రూ. 25 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీక్షలలో ఆశ వర్కర్లజిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ, సునీత, జిల్లా నాయకులు కాంతమ్మ, పద్మ, చెన్నమ్మ, సరస్వతి, నరసమ్మ, భారతి, సుజాత, నాగప్రమీల, సిఐటియు అధ్యక్షుడు ఏ వెంకటస్వామి, జిల్లా నాయకులు నరసింహ, ఉప్పేరు నరసింహ, అంజి తదితరులు పాల్గొన్నారు.