Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. శుక్రవారం ఆయన ప్రభుత్వ ప్రధానాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఐసీయూ, అత్యవసర విభాగంతో పాటు, మాత శిశు సంరక్షణ విభాగం ,జనరల్ ఓపి, డిస్పెన్సరీ ఎంసిఎచ్ డ్రగ్ స్టోర్ తదితర విభాగాలను, తనిఖీ చేశారు. ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక ఓపిలో ప్రతిరోజు వస్తున్న రోగులు, ఇన్ పేషెంట్స్ తో పాటు, ఎంసి హెచ్ డ్రగ్ స్టోర్ లో రిజిస్టర్ల నిర్వహణను తనిఖీ చేశారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన రోగులతో ఆయన ముఖాముఖి మాట్లాడుతూ వైద్య సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్లతో సమావేశమై ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని, మందుల కోసం ఎవరు బయటకు వెళ్లకుండ చూడాలని చెప్పారు. ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ ఇబ్బంది లేకుండా చూడాలని, సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ రామ్ కిషన్ ఇతర డాక్టర్లు పాల్గొన్నారు.