Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు భోగభాగ్యాల భోగి
- రేపు మకర సంక్రాంతి...
- కమనీయ పండుగ కనుము
- గ్రామాల్లో మొదలైన పండుగ సందడి.
- పతంగులు,పిండి వంటలతో బిజీబిజీ.
ఈ పండగ చలికాలంలో వస్తుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పుష్య మాసాలలో వచ్చే పండుగ సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి చేరడాన్ని సంక్రాంతి అని సంక్రమణ అని పిలుస్తుంటారు. ఈ దినాల్లో మహిళలు తమ ఇళ్ళల్లో రంగులు ముగ్గులతో, గొబ్బిళ్ళతో ఆకర్షణీయంగా అలంకరించుకుంటారు.
నవతెలంగాణ- తిమ్మాజిపేట / నర్వ
తిమ్మాజిపేట, నర్వ మండల పరిధిలోని లంకాల, కొత్తపల్లి, బెక్కర్ పల్లి తదితర గ్రామాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి.కబడ్డీ,200 మీటర్స్ రన్నింగ్,సందెపురాళ్లు, బండలాగుడు,క్రికెట్‌తో పాటు ముగ్గుల పోటీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. తెలుగు వారికి అత్యంత ప్రీతి పవిత్రమైన పండగ సంక్రాంతి ఈ పండగకు రైతన్న ఇంట్లో నవధాన్యాలు సిరులతో కళకళ లాడుతాయి...కానీ పండుగ చేసుకునేందుకు నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటూ ఉండడంతో సగం మంది పెదలు, రైతన్నలు సంక్రాంతిని చేసుకునే వారు పెరుగు తున్న నిత్యావసర వస్తువుల ధరలు వెరసి సంక్రాంతి పండుగకు అంతా బ్రాంతి గానే మారింది. సంక్రాంతి పండగ భోగభాగ్యాలు అందించేది కావడంతో పండగలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగను భోగి, మకర సంక్రాంతి, కనుమల పేరిట మూడురోజుల ఈ పండుగను జరుపుకుంటారు. దినాల్లో మహిళలు తమ ఇళ్ళల్లో రంగులు ముగ్గులతో,గొబ్బిళ్ళతో ఆకర్షణీయంగా అలంకరిం చుకుంటారు. గ్రామీణ వాతావరణంలో ఆవుపేడతో గొబ్బిళ్లను తయారుచేసి పిండి గోమ్మలు తంగేడు పూలతో అలంకరించి వాకిళ్ళ ముందు నవధాన్యాలతో పూజిస్తారు. ఈ నెల 14న బోగితో ప్రారంభమై 15న మకరసంక్రాంతి, 16న కనుమ పండుగతో ముగుస్తున్నంది. సంక్రాంతి పండుగకు హరిదాసులు గంగిరెద్దుల వారు కుటుంబ యజమానులను సంతప్తిపరచి వారిచ్చే దానాలతో సంతప్తి చెందుతారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవటంతో పండుగ వాతావరణం నెలకొంది.
మొదటిరోజు భోగి : ఇంటిముందు ముగ్గులు వేస్తారు.ముగ్గుమధ్యలో 'గొబ్బెమ్మ'లను ఉంచుతారు. వీధుల్లో 'భోగిమంటలు' వేస్తారు.అప్పటి నుంచే ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నాడని భోగిమంట సంకేతం. దక్షణాయనంలో నిద్రబద్ధకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే భోగిమంటలు వేస్తారు.ఇంట్లో ఉండే పాత వస్తువులాంటివి భోగిమంటలో వేసి తగలబెడుతారు.
రెండోరోజు సంక్రాంతి : అన్ని పండుగలు తిథి ప్రకారం తేదీ మార్పులతో వస్తూ ఉంటాయి. కానీ,సంక్రాంతి మాత్రం ప్రతియేడాది జనవరి 14 లేదా 15 తేదీల్లో రావటం గమనార్హ . మహారాష్ట్రీయులు, గుజరాతీలు మకర సంక్రాంతి అని,తమిళులు 'పొంగల్' అని పంజాబీలు 'లోరీ' అని అంటారు.
మూడోరోజు కనుము : కనుమనే పశువుల పండుగ అంటారు.తమ చేతికొచ్చిన పంటను తామే కాకుండా పశువులు,పక్షులు పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. గొబ్బెమ్మల పూజ, చిన్నపిల్లలు గాలిపటాలు ఎగురవేస్తుం డటం,గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాక, బంతిపూల తోరణాలు, ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తాయి.