Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -కొల్లాపూర్
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక నవతెలంగాణ అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం చిన్నంబావి మండలం పెద్ద మారూరులో నవతెలంగాణ క్యాలెండర్ ను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి పరిపూర్ణంతో కలిసి ఆయన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవతె లంగాణ లో వస్తున్న వార్తలు యావత్ ప్రజల కష్టనష్టాలు కర్షక కార్మికుల జీవన స్థితిగతులపై వార్తలు రాస్తూ నిజాలను నిర్భయంగా ప్రజల్లోకి అందిస్తూ వస్తుం దన్నారు నేటి సమాజంలో ప్రజల చైతన్యం కోసం పని చేసే నవ తెలంగాణ లాంటి పత్రికలు నేడు ఎంతో అవసరం అన్నారు పత్రికను రాష్ట్రవ్యాప్తంగా ఆదరించాల్సిన అవసరం ప్రజలకు ఉందన్నారు ఆవిష్కరణ అనంతరం నవ తెలంగాణ పాఠకులకు ప్రజలకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు సర్పంచులు ఉన్నారు.