Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కల్వకుర్తి
కల్వకుర్తి పట్టణంలోని టీఎస్ యూటీఎఫ్ భవన్ ఆవరణలో శుక్రవారం సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు దేశం వెంకట్ రెడ్డి జ్ఞాపకార్థం అఖిలభారత ప్రజాతంత్ర సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాలానికి చెందిన మహిళలు వివిధ రకాల రంగురంగుల ముగ్గులతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ చైతన్య కిషోర్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది జ్యోతి తదితరులు న్యాయ నిర్మేత లుగా వివరించారు.ఈ సందర్భంగా ముగ్గులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు గున్నమ్మ, చంద్రకళ, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఏపీ మల్లయ్య, కేవీపీఎస్ జిల్లా నాయకులు పరుశరాములు, యూటీఎఫ్ నాయకురాలు పద్మ, సుజాత, నాయకులు కృష్ణయ్య విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.