Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పెబ్బేర్
మండలంలోని పెంచికలపాడులో జనసేన ముఖ్యకార్యకర్తల సమావేశంలో వనపర్తి జనసేన కో- ఆర్డినేటర్ ముకుంద నాయుడు పాల్గొని జనం కోసం జనసేన కార్యక్రమం పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముకుందనాయుడు మాట్లాడుతూ ఈ వారం నుంచి వనపర్తి నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో జనం కోసం జనసేన కార్యక్రమం పేరుతో పర్యటన మొదలు చేసి పార్టీ సిద్ధాం తాలు ఆశయాలను ప్రజలకు తెలియజేస్తూ జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో పోటీ చేయడానికి పార్టీ సిద్ధంగా ఉందన్నారు. సామాజిక న్యాయం సాధించే విధంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికీ పెద్దపీట వేస్తూ రాజ్యా ధికారానికి అందరినీ చేరువ చేస్తామని, ఈ భావాలను ప్రజలకు వెల్లడించాలని సూచించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సురేశ్ నాయుడు, నరేష్,జీ. నరసింహ, రామ గోవిందు, అశోక్ కుమార్, యోగి నాయుడు, హరీష్ శంకర్, భాస్కర్, శ్రీదర్, నవీన్ నాయుడు, రాజేష్ కుమార్, సంజీవ్, విష్ణు, గణేష్, బన్నీ, శివ, హేమ వర్ధన్ నాయుడు పాల్గొన్నారు.