Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - కొత్తకోట
రాష్ట్ర ప్రభుత్వం జనవరి 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమంలో ఆశా కార్యకర్తలకు అదనపుగా పారితోషికాలు చెల్లించాలని ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి జే భాగ్య కోరారు. సోమవారం కొత్తకోట ప్రాథమిక ఆసుపత్రి వద్ద ఆశ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసి సూపర్వైజర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశలకు నిర్ణీత వేతనం లేదని పనిని బట్టి పారితోషికం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కంటివెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషికం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మంజుల, రజిత, సంతోష, అర్చన, పుష్ప ,స్వాతి, కాంచన, లక్ష్మి , చిట్టెమ్మ, చంద్రకళ,సుజాత, దేవి, రేణుకు పాల్గొన్నారు.