Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మహబూబ్ నగర్
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాల్లో వెంటనే ఆటలు ప్రారంభించడానికి అణువైన ఏర్పాట్లు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా మునిమోక్షం ,యారోన్పల్లి, మాదారం గ్రామాలలో క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎం కురు మయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు నైపుణ్యాన్ని గుర్తించే ఉద్దేశంతో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేశాయని వారు తెలిపారు. కానీ ఇప్పటికే అక్కడ క్రీడాకారులు ఆడుకోవడానికి అనువైన పరిస్థితులు కనిపించడం లేదని వాటిని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మట్టిలో మాణిక్యం లాంటి క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాల్లో లభిస్తారని వారిని గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణా రూపొందించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతీ యువకులు క్రీడలు ఆడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. మా సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి వాళ్ళని వెలికి తీసేందుకు ఎంతో కషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టంకర రాములు శ్రీకాంత్ గోపాల్ రమణయ్య పాల్గొన్నారు.
మిడ్జిల్ : మహిళా సమస్యల కోసం నిరంతరం ఐద్వా ఆధ్వర్యంలో పోరాటంలో ముందు ఉండి వారి సమస్యల కోసం పోరాటం చేసేదని అరుణను మహిళలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రాములు అన్నారు. ఆదివారం మండలంలోని వాడియాల గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఐద్వా, డివైఎఫ్ఐ ,తెలంగాణ రైతు సంఘం, ఆధ్వర్యంలో అరుణ జ్ఞాపకార్థకంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల్లో ఉన్న నైపుణ్యతను వెలికి తీయడానికే ముగ్గుల పోటీలను నిర్వహి ంచారు. ముగ్గుల పోటీ తో పాటు చిన్నారులకు మహిళలకు కుర్చీల పోటీని నిర్వహించారు అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారందరికీ ప్రత్యేక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీనివాసులు టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు వెంకటయ్య, వార్డు మెంబర్ సుకుమారు, రైతు సంఘం నాయకులు, మధు, జంగయ్య, శ్రీనివాసులు, కరుణాకరు, జంగయ్య, రవీందర్, మహిళా సంఘం అధ్యక్షు రాలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
మిడ్జిల్ : సంక్రాంతి పండుగను పురస్కరి ంచుకొని మండలంలోని బైరంపల్లి , కంచనపల్లి, కొత్తపల్లి, వేముల , వాడియాల, మసుగుల్లపల్లి, కొత్తూరు, తదితర గ్రామాలలో క్రికెటు,, ముగ్గుల పోటీలను నిర్వహించారు. గెలుపొందిన క్రీడా కారులకు మహిళలకు బహుమతులను గ్రామ పంచాయతీ యువజన సంఘ ఆధ్వర్యంలో అంద జేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పం చులు ఎంపీటీసీలు జడ్పీటీసీ ఎంపీపీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మున్నూరు గ్రామంలో క్రికెట్ పోటీలకు గెలుపొందిన వారికి బహుమతులను రంగారెడ్డిగూడా సర్పంచి అందజేశారు.
మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి : గ్రామీణ క్రీడలు దేశానికి ఉత్తమ క్రీడ కారులని అందిస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రాధాన కార్యదర్శి కడియాల మోహన్ అన్నారు ఆదివారం మహబూబ్ నగర్ మండలం మాచన్ డబుల్ గ్రమంలో నిర్వహించిన సంక్రాంతి క్రీడలు ముగింపు సందర్బంగ ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడుతూ సంక్రాంతి ముగ్గుల మాట్లాడుతూ పండగలో అంటే ఇంట్లోకి పరిమితమై కాకుండా నలుగురిలో కలిసి సంతోషంగా జరుపుకోవాలన్నారు.అనంతం క్రీడ కారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అసంఘం జిల్లా ఉపాధ్యక్షలు హన్మంతు సహాయ కార్యదర్శి భగవంతు మండల అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు
మహబూబ్ నగర్ : దివిటిపల్లి గ్రామ డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్ కాలనీలో ముగ్గుల పోటీలను శ్రీనన్న యువసేన ఆధ్వర్యంలో సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ యువకులు మహిళలు పిల్లలు పాల్గొని సురేందర్ రెడ్డి కి కాలనీవాసులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు రాఘవేంద్ర యాదవ్, నాయకులు నరసింహ రెడ్డి, రామస్వామి, కొత్త గొల్ల రామాంజనేయులు, వెంకటేష్ యాదయ్య, రాములు, సాకలి మల్లేష్ ,మంగలి, వీరప్ప, భాస్కర్, శ్రీకాంత్, పాండు, మాధవులు, తిలక్, సూరి దేవేందర్, నాని, శ్రీశైలం, మధు, యాదగిరి, శివరాజ్,రవి, విష్ణు పాల్గొన్నారు.
రాజాపూర్ : రాజాపూర్ మండలంలోని కొర్రతండా గ్రామపంచాయతీలో యువసేన సభ్యులు బీఆర్ఎస్పార్టీ యువనేత దొండ్లపల్లి ఎంపీటీసీ ి చించోడ్ అభిమన్యు రెడ్డి సహకారంతో కొర్రతండా మరియు బదిలీ తాండ యువత సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. అందుకుగాను క్రికెట్ ప్లేయర్స్ కి టీ షర్ట్, మరియు బహుమతులు మొదటి ఆర్థిక బహుమతి 3000/- రెండవ ఆర్థిక 2000 బహుమతి స్పాన్సర్ చేసి యువత ఆటల పోటీలలో గెలుపు ఓటములు సహజమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హన్యా నాయక్ యువసేన కోశాధికారి హతిరాం నాయక్, వార్డు మెంబర్ చందర్ నాయక్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రమేష్ నాయక్,బాల్కోటి టీం, తార్య టీం, వినోద్ టీం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ : పల్లె ప్రాంతాలలోని ప్రజలు మూడు రోజులపాటు సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమేతంగా పండుగను మూడు రోజులపాటు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వివిధ గ్రామాలలో గల కిరాయి గుట్ట పలు దేవాలయాలలో సోమవారం దర్శించుకున్నారు.