Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వనపర్తి
జిల్లా కేంద్రంలో బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 2023 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని సంఘం గౌరవాధ్యక్షులు పుట్టాంజనేయులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవననిర్మాణ కార్మికులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకా రంగా ప్రతి కార్మికునికి మోటార్ సైకిల్ ఇవ్వాలన్నారు. 60ఏళ్లు నిండిన కార్మికులకు పింఛన్, కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్, అడ్డా ప్రాంతాల్లో షెడ్లు మరుగుదొడ్లు తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని, సొంత స్థలం ఉన్న వాళ్లకు ఐదు లక్షల ఆర్థికసాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మదన్, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ ఉపాధ్యక్షులు డీ. కురుమన్న, కే వెంకటయ్య, శ్రీను ,నరేందర్, ఓంకారం ,వసంత్, బాలస్వామి,బీ కురుమయ్య, మన్యం, పీ. ఆంజనేయులు , బాలరాజు తదితరులు పాల్గొన్నారు.