Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యానవనాలపై దృష్టి సారించని అధికారులు
- కౌలు రైతులకు మొదలైన కష్టాలు
- ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి
- రైతు సంఘం నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు
కొల్లాపూర్ మామిడి కండంతరాలకు ఖ్యాతి ఊహించింది. ఈ ప్రాంత బెనిషాన్ అతి రుచికరంగా నాణ్యవంతంగా ఉంటుంది. ఈ ఏడాది వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల పూత ఆగిపోయింది. వాతావరణంలో తేమ తగ్గకపోవడం వల్ల మామిడి పూత విచ్చుకోవడం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వపరంగా నాణ్యమైన పంట సాగు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. మామిడి సాగులో ఎక్కువ మంది రైతులు కవులు తీసుకొని సాగు చేస్తున్నారు. ఏడాది పూత రాకపోవడంతో కౌలు రైతులు నిలువునా మునిగే అవకాశాలు ఉన్నాయి. కొనఊపిరిలో ఉన్న కొల్లాపూర్ మామిడి రైతులను ఆదుకోవాలని పను పార్టీలు రైతు సంఘాలు కోరుతున్నాయి.
నవ తెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉద్యానవన తోటల్లో మామిడి సాగు ముఖ్యమైనది. ముఖ్యంగా కొల్లాపూర్ బేనేశాన్ ప్రపంచ దేశాలలో మంచి ఆదరణ ఉంది. ఉద్యానవన తోటల్లో అత్యధిక మంది రైతులు కౌలుకు చెందినవారే. గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఉద్యానవనాలను ఐదు ఆరు సంవత్సరాలకు ఒకసారి లీజుకు తీసుకుంటారు. ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క సారి మామిడి దిగుబడి రాకపోయినా కౌలు రైతుకు కోలుకునే పరిస్థితులు ఉండవు.ప్రస్తుతం మామిడి తోటల్లో పూత నల్లగా మారడం, పూత రాలిపోవడం, పూతకు బూడిద తెగులు చుట్టుమడుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కొంత మేరకు పడిపోవడం ద్వారా తేనె మంచి ప్రభావం మరియు ,నల్ల తామర ఉదృతి మనకు తోటల్లో కనిపిస్తుంది.
కౌలు రైతులకు అందరి సహకారం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో లక్ష15, వేల ఎకరాలలో మామిడి తోటలు ఉన్నాయి. 25 వేల ఎకరాలు ఐదు సంవత్సరాలలోపు వయసు ఉంటే మిగతావి 10 సంవత్సరాల పైబడి న తోటలు ఉన్నాయి. మామిడి తోటల మీద ఆధారపడి పదివేల మంది కవులు రైతులు జీవనం సాగిస్తున్నారు. ఏడాది ఆలస్యంగా చలి రావడంతో ఆశించిన స్థాయిలో పూత రాలేదు. సగం మామిడి తోటలు పూత రాకుండానే ఆగిపోయాయి. 10శాతమైన పూత రాకుంటే కవులు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని కౌలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానవన రంగానికి బ్యాంకులు సైతం సహకరించడం లేదు. పంట పెట్టుబడి పెట్టింపు ఉన్న పంట రుణాలలో వివక్ష చూపుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యానవన రైతులను ఆదుకోవడానికి ఒక వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాలని పలు రైతు సంఘాలు కోరుతున్నాయి.
పూత లేదు ఖాతా లేదు.
నేను 50 ఏళ్లుగా మామిడి తోటలను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాను. పూత ఆలస్యంగా రావడం ఇదే మొదటిసారి. తోటలకు తేమ శాతం అధికంగా ఉంటేనే పూత వస్తుందని అధికారులు చెబుతున్నారు. వాతావరణం అనుకూలించక పూత రాలేదు. రైతులకు మాత్రం కౌలు చెల్లించడంలో ఎటువంటి రాజీ ఉండదు. ప్రభుత్వం స్పందించి కౌలు రైతులను ఆదుకోవాలి.
- లక్ష్మయ్య, కౌలు రైతు, రాకొండ, తెలకపల్లి మండలం
తేమశాతం తగ్గి చలి లేకపోవడం వల్లే పూత రాలేదు
నవంబర్ చివర్లో రావలసిన పూత జనవరి సగభాగం దాటిన ఆశించిన స్థాయిలో పూత రాలేదు. ముఖ్యంగా గాలిలో తేమ తగ్గితేనే పూత వస్తుంది. నవంబర్ చివర్లోనే తేమ తగ్గాల్సి ఉంది. ఏడాది ప్రకృతి సహకరించకపోవడం వల్ల చలి ఆలస్యంగా తీవ్రత అయింది. చలి ఆలస్యంగా రా తీవ్రం కావడం వల్ల మామిడి పూత విచ్చుకోలేదు. ఇప్పటికైనా రైతులు పూత రాకముందే పిచికారి మందులను చల్లాలి తప్ప పూత వస్తున్న సమయంలో పిచికారి చేయరాదు. పూత సమయంలో పిచికారి చేస్తే పూతరాలి దిగుబడి మరింత తగ్గుతుంది.
- చంద్రశేఖర రావు ఉద్యానవన శాఖ జిల్లా అధికారి నాగర్ కర్నూల్