Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -జడ్చర్ల
రాష్ట్రంలో దళితులను గిరిజనులను మోసం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఒకటేనని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ విమర్శించారు. గురువారం జడ్చర్ల ఐబి బంగ్లాలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కెసిఆర్ అధికారంలోకి వచ్చాక దళితులకు మూడు ఎకరాల భూమి ముఖ్యమంత్రి పదవి అంటూ మోసం చేశారని గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లన్ని వాళ్లను మోసం చేశారని అన్నారు.ఈనెల 22వ తేదీ నాగర్ కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్న దళిత గిరిజన ఆత్మగౌరవ సభను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బూర్ల వెంకటయ్య, మీనాజ్ బుక్క వెంకటేశం, కరాటే శ్రీను, హుమైన్ బంగ్ల రవి, రవీంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.