Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి : మరోసారి దళితులపై దాడి చేస్తే దండయాత్ర తప్పదని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి హెచ్చరించారు.ఈనెల 22న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవసభను విజయవంతం చేయాలని కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మార్కండేయ ప్రాజెక్టు సందర్శన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులైన వాల్యా నాయక్ మిద్దె రాములు పై బీఆర్ఎస్ నేతలు దాడి చేసి హత్యాయత్నానికి ఒడిగట్టడం దారుణమని దానిని నిరసిస్తూ 22న మధ్యాహ్నం మూడు గంటలకు బిజినేపల్లి మండల కేంద్రంలో నిర్వహించే ఆత్మగౌరవ సభకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం టాక్రే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు హాజరవుతున్నారని ఆయన వివరించారు. సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలో పలువురికి బాధ్యతలను అప్పగించడం జరిగిందని బిజినేపల్లి మండలానికి ప్రదీప్ గౌడ్ తెలకపల్లి మండలానికి రవళి తాడూరు మండలానికి సరిత నాగర్ కర్నూల్ మండలానికి నరసింహారెడ్డి తిమ్మాజీపేట మండలానికి విజయ రెడ్డి లను కేటాయించడం జరిగిందని తెలిపారు. దళిత గిరిజనులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు ఈనెల 22 వరకు విధులలో ఉన్న పోలీసులను అక్రమ కేసులకు ప్రోత్సహించిన వారిని విధుల నుండి సస్పెండ్ చేయడంతో పాటు నిందితులపై సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేయకపోతే ఆత్మగౌరవ సభ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండలాల ఇంచార్జిలు, అర్థం రవి బాలా గౌడ్, రోహిణి ,గోవర్ధన్ రెడ్డి ,రాములు పాల్గొన్నారు.