Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి : గత 15 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో ఉంటూ ఎన్నో సామాజిక సమస్యలపై తన గళం కళం చేత విప్లవాత్మక మైన వార్తలు రాస్తూ గుర్తింపు తెచ్చుకున్న జర్నలిస్ట్ వాకిట అశోక్ కుమార్. జర్నలిజంలో భాగంగా మొదట ఆంధ్రప్రభ రిపోర్టర్ గా తన ప్రస్తానం మొదలుపెట్టి అంచలంచలుగా, సూర్య ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా , నమస్తే జనశక్తి జిల్లా బ్యూరో ఇంచార్జిగా, ఆంధ్రప్రభ , మనం ,ప్రజా జ్యోతి బ్యూరో ఇంచార్జిగా , లుగా ఎదిగారని తెలిపారు. అనంతరం సుదీర్ఘ జర్నలిజం చరిత్రలో తనకంటూ ఒక సొంత పత్రికను నెలకొల్పాలని తలంచి మంచి సహృదయం మన ఉదయం పత్రికను స్థాపించారు. గురువారం మహబూబ్ నగర్ పట్టణంలోని రెడ్ క్రాస్ ఆడిటోరియంలో సీనియర్ జర్నలిస్టుల చేత మన ఉదయం కేలండర్ ను ఆవిష్కరించి నూతన ఒరవడికి నాంది పలికారు.అనంతరం సీనియర్ జర్నలిస్టులను గౌరవించి వారినీ శాలువా పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ బండి విజయ్ కుమార్ తెలుగు సత్తా ఎడిటర్, ఎండి రఫీ వార్త స్టాప్ రిపోర్టర్, బసవరాజ్ ఏబీఎన్ బ్యూరో ఇన్చార్జ్, నరేందర్ చారి హెచ్ఎంటీవీ ఇంచార్జి , జెమిని శేఖర్ జిఎస్ మీడియా చైర్మన్ , విజయరాజు వార్త తరంగాలు ఎడిటర్, ఐలమోని శేఖర్ ప్రజాపక్షం బ్యూరో ఇంచార్జి, పరిపూర్ణం నవ తెలంగాణ బ్యూరో ఇంచార్జ్, ఎంవి రమణ వార్త పవర్ తెలుగు దినపత్రిక ఎడిటర్ మిత్ర న్యూస్ ఛానల్ చైర్మన్, శేఖర్ గౌడ్ వార్త వేదిక ఎడిటర్, ఎస్ఎస్ జరిగి కాస్మోస్ బులిటెన్ ఎడిటర్, కందికొండ మోహన్ మనం పత్రిక స్టాఫ్ రిపోర్టర్, మోయిజు కాస్మోస్ బుల్ టెన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి, వేణుగోపాల్ గౌడ్ మనం పత్రిక, బాలు మనం పత్రిక, కృష్ణ సూర్య పత్రిక ఫోటోగ్రాఫర్. తదితరులు పాల్గొన్నారు.