Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రమిర్చికి నల్లతామర తెగులు
- పంట చేలకు చుట్టుముట్టిన తెగుళ్లు
- కుల్లారిపోతున్న పంటలు
- తెగులు నివారణకు చర్యలు తీసుకోవాలి :నడిగడ్డ రైతుల
మిర్చి సాగుతో మంచి దిగుబడి వస్తుందునకున్న రైతులకు కష్టాలే మిగిలాయి. నల్లతామర తెగులతో పై ముడత వచ్చి పంటలు మొత్తం దెబ్బతింటున్నాయి.అంతుచిక్కని తెగులు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 50 వేల ఎకరాలలో సాగు చేసిన మిర్చి తోటలను వైరస్‌తో తోటలు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. ముడుత తెగులతో పంటలు కుళ్లారిపోతున్నాయి. తెగులు నివారణ కోసం వ్యవసాయ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లనే మిర్చికి తెగులు సోకాయని ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీంతో మిర్చి రైతులు తీవ్ర నష్టాల్లో కురుకపోతున్నారు.
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ గద్వాల జిల్లాల పరిధిలో సాగు చేసిన మిర్చి రైతు కళ్లలో మంట తెప్పిస్తున్నాయి.వనికించే చలి,పడిపోయిన ఉష్ణోగ్రతల వల్ల మిర్చి పంటలకు ముప్పు ఏర్పడింది. మారిన ఉష్ణోగ్రతల వల్ల మామిడి తోటలు అతలాకుతలం కాగా ఇప్పుడు మిర్చి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.పంటలను కాపాడు కోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా నల్ల, తెల్లతామర, పేనుబంక, ఎర్రనల్లి సోకినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.ఇప్పటికే ఎరువులు, క్రిమిసంహారిక మందులు, పొలం పనుల కోసం ఎకరాకు రూ. 75 వేల ఖర్చు అయ్యింది. తెగుళ్లవల్ల చేసిన రెక్కల కష్టం బూడిద పాలవుతుందన్నారు. రైతులు ఆందోళన చేస్తున్నారు. తెలకపల్లి , బిజనపల్లి, గోపాల్పేట, జడ్చర్ల తధితర మండలాల పరిధిలో ఈ తెగుళ్ల ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల మిర్చి పంటను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా అధిక చలి వల్ల పంటలు ఎర్ర,నల్ల తామరతో పాటు వైరస్, దోమల బెడద అధికమయ్యింది.అంతుచిక్కని వైరస్‌తో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ధర పాతాళానికి పతనం అయ్యింది.నెలరోజులకు ముందు క్వింటాళ్లు మిర్చి 22వేలు ఉంటే తాజాగా 14 వేలకు పడిపోయింది. మరింత పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాపార పర్గాలు చెబుతున్నాయి. మిర్చి ధర పతనం గాకుండా నియంత్రన చేపట్టాలని,రైతు సంఘాల నాయకులు కోరారు.
మిర్చి వల్ల తీవ్రంగా నష్టపోయాం.
వేల రూపాయలు పెట్టి మిర్చి పంటలను సాగు చేశాం. ఎకరాకు 60 వేల ఖర్చు అయ్యింది. తీర దిగుబడి మాత్రం 80 శాతానికి పడిపోయింది. నల్ల,తెల్ల తామర మమ్ములను నిలువునా ముంచింది. ప్రభుత్వం నష్టాన్ని పరిలించి సరైన వ్యవసాయ సుచనలు ఇవ్వాలి. ముఖ్యంగా ధర పతనం గాకుండా నియంత్రణ చేపట్టాలి. లేనిచో అప్పుల పాలవుతాం.
- వి. గోవర్థన్‌రెడ్డి, రైతు నడిగడ్డ
మిర్చి రైతులు యాజమాన్య పద్దతులను పాటించాలి
ప్రస్తుత సీజన్లో తెల్లదోమ నల్లతామర సోకుతుంది. దీని నుంచి రైతులు పంటలను కాపాడుకోవాలి. ఇప్పటికే కొన్ని గ్రామాలను పరిశీలించి తెగులు పట్ల ఒక అంచనాకు వచ్చాము.తాడూరు మండలం గుంతకోడూరు మిర్చి పంటలను పరిశీలించాం. అధికారులు సూచించిన మందులు పిచికారి చేయాలని సూచించాం.
- మహేశ్వరి,వ్యవసాయ అధికారి, నాగర్‌కర్నూల్