Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్ నగర్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లాలో అధికారులు అందరూ సమిష్టి కృషితో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాత పాలమూరు కమ్యూనిటీ హాల్లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 8 గంటలకే ప్రజలందరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కంటి వెలుగు కేంద్రాలకు రావడం సంతోషమని అన్నారు. ''సర్వేంద్రియానం నయనం ప్రధానం'' అన్నారని, అలాంటి కంటికి సంబంధించి కంటిచూపుతో ఇబ్బందులు పడేవారి కి వైద్య పరీక్షలు నిర్వహించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గడచిన 15 రోజులుగా జిల్లా యంత్రాంగం జిల్లా కేంద్రంతో పాటు, అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ , డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ భాస్కర్ నాయక్ ,వార్డు కౌన్సిలర్ తిరుపతమ్మ ,కంటి వెలుగు ప్రాజెక్టు అధికారి ప్రోగ్రాం అధికారులు వినోద్ రెడ్డి, మోతిలాల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు నటరాజ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జడ్చర్ల టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి కంటి వెలుగు పథకం రెండవ విడత ప్రారంభం, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మ పేట ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యక్రమం 100 రోజులపాటు ఉంటుందన్నారు.కార్యక్రమంలో, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి రవీందర్, వైస్ చైర్మన్ సారిక రామ్మోహన్, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, డాక్టర్ శివకాంత్, తహసిల్దార్ లక్ష్మీనారాయణ,జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నె గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్, కౌన్సిలర్లు, బాబా, చైతన్య చౌహన్, జ్యోతి కృష్ణారెడ్డి, లత, ఆలూరి శశికిరణ్, దేశవాళి సతీష్, నందకిషోర్, కోట్ల ప్రశాంత్ రెడ్డి, మరియు టిఆర్ఎస్ నాయకులు, పట్లోళ్ల నాగిరెడ్డి, ఇర్ఫాన్ బారు, మథిన్, సిఎల్ఆర్ సేవా సమితి అధ్యక్షుడు పర్వత రెడ్డి, మల్లేశ్ మరియు మెప్మా సిఎల్ఆర్పి, సునీత, ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు, పాల్గొన్నారు.
బాలానగర్ :బాలానగర్ మండల పరిధిలోని ముదపల్లి గ్రామంలో గురువారం కంటి వెలుగు కార్యక్రమాన్ని బాలా నగర్ జెడ్పీటీసీ జరుపుల కళ్యాణి డిసిఎం ఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర గిరిజన నాయకుడు లక్ష్మణ్ నాయక్ గ్రామ సర్పంచ్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బాలానగర్ :మండల కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి తిరుపతి గురువారం జడ్పిహెచ్ఎస్ హైస్కూల్ ఆవరణలో ప్రారంభించారు. ఆమె వెంట మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కమల,జీసీసీ చైర్మన్ వాళ్లే నాయక్,తహసీల్దార్ శ్రీనివాస్,ఎంపీడీవో కృష్ణారావు, ఎస్సై జయప్రకాష్ పాల్గొన్నారు.
రాజాపూర్ : రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన లక్ష్మారెడ్డి ప్రజలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.గురువారం రాజాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కంటి వెలుగు ప్రారంభ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ సుశీల సర్పంచుల సంఘం అధ్యక్షులు బుచ్చిరెడ్డి మాజీ ఎంపీపీ మైపాల్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ ఎమ్మార్వో రామ్ భారు ఎంపిటిసి చెంచోడు అభిమన్యు రెడ,ి్డ అధికారులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.
గండీడ్ :ఉమ్మడి గండీడ్ మండలానికి చెందిన జానంపల్లి, అంచన్ పల్లి, మహమ్మదాబాద్, చిన్నాయి పల్లి గ్రామాల్లో గురువారం రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి ప్రారంభించారు.కార్యక్రమంలో ఉమ్మడి మండల జడ్పిటిసి మాచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ మాధవి రాజ్ కుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, ఎమ్మార్వో జ్యోతి, మహమ్మదాబాద్ఎమ్మార్వో అంజనేయులు, ఎంపీడీవో రూపేందర్ రెడ్డి, ఎంపీఓ శంకర్ నాయక్, స్థానిక సర్పంచులు, సీనియర్ నాయకులు అశోక్ గౌడ్,రామచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి, యువ నాయకుడు కృష్ణ గౌడ్ పాల్గొన్నారు.
మిడ్జిల్ : రాష్ట్రంలో అందత్య నివారణ కోసం కెసిఆర్ రాష్ట్రంలో కంటి వెలుగు పథకాన్ని తీసుకొచ్చారని జెడ్పిటిసి శశిరేఖ బాలు అన్నారు. గురువారం మండల కేంద్రంలో గ్రామపంచాయతీ భవనంలో ఎంపీపీ కాంతమ్మ సర్పంచ్ రాధిక వెంకట్ రెడ్డి మిడ్జిల్ ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ గౌస్ తో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాజీవ్ రెడ్డి, ఎంపీడీవో సాయి లక్ష్మి, ఎంపీఓ అనురాధ, డాక్టర్ కృష్ణ కుమార్ మనుప్రియ, మండల ఆర్ఐ రామాంజనేయులు స్థానిక నాయ కులు వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.