Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మహబూబ్ నగర్
రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం జిల్లాల్లో ఉపాధ్యాయ బదిలీలలో ఎలాంటి అక్రమాలకు తావివ్వొద్దని యూటీఎఫ్ మహబూబ్నగర్ పట్టణ కార్యదర్శి హేమంత్ కుమార్ కోరారు. గురువారం మహబూబ్ నగర్ అర్బన్ మండల విద్యా శాకాధికారి కే.జయశ్రీ కలిసి వినతి పత్రం అందించారు. యూటీఎఫ్ డైరీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో నిర్వహించే ఉపాధ్యాయ బదిలీలలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని కోరారు. మేనేజ్మెంట్ల ఉపాధ్యాయుల వివరాలను తప్పులు లేకుండా చూడాలని , సీనియారిటీ లిస్టుని ముందుగానే విడుదల చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో అర్బన్ మండల కమిటీ అధ్యక్షులు శంకర్ ,ప్రధాన కార్యదర్శి, హేమంత్ కుమార్, కథల య్య , కోశాధికారి శ్రీ శ్రీనివాస్ ఆర్య మండల కార్యదర్శి లు చంద్రయ్య , దశరథం తదితరులు పాల్గొన్నారు.