Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహమ్మదాబాద్
మండల పరిధిలోని నంచర్ల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6, 7 ,8 తరగతుల విద్యార్థులకు జాతీయ కుష్టి వ్యాధి నివారణలో భాగంగా పాఠశాల విద్యార్థులకు కుష్టి వ్యాధి నివారణ వాటి లక్షణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ కుష్టు వ్యాధి మైక్రోబాక్టీరియా లెప్రే ద్వారా వస్తుందన్నారు. కుష్టి వ్యాధికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు విజయ భూషణ్, నంచర్ల ఏఎన్ఎం బిందు రాణి, డిప్యూటీ ప్యారా మెడికల్ ఆఫీసర్ అడిషనల్ లెప్రసీ డీఎంహెచ్ఓ. హనుమంతరావు, డిప్యూటీ ప్యారా మెడికల్ ఆఫీసర్ నరసింహారావు ,పాఠశాల పీఈటీ ఆంజనేయులు, ఆశా కార్యకర్తలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.