Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - మహబూబ్ నగర్
జిల్లాలో గ్రామ సర్పంచులకు, ప్రజలకు పోలీస్ శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ కే నరసింహ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శ్రీ ప్రణీల్ చంద్ర జిల్లా ఎస్పీ కే నరసిం హను తనతోటి 20 మంది గ్రామ సర్పంచ్ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ తరఫున మీకు ఎలాంటి సహాయమైనా చేస్తానని హమినిచ్చారు. అలాగే మీ గ్రామంలలో వున్న ప్రజల సమస్యలపై ఏప్పుడైనా నాకు కాల్ చేసినచో సంబంధిత ఎస్ హెచ్ ఓ/అధికారులకు మీ సమస్య త్వరగా పరిష్కరించమని ఆదేశాలిస్తానన్నారు. మీ యొక్క గ్రామాలలొ ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లయితే తక్షణమే మీ పరిధిలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చినట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగ కుండా చూడలన్నారు. అవసరమైతే గ్రామం నందు సీసీ కెమెరాలు అమర్చు కోండి, ప్రతి గ్రామములో నేరాలు జరగకుండా అవగాహన సద స్సులు పెట్టి స్వేచ్ఛ స్వాతంత్రంలో ప్రజలను ఉంచేటట్లు చూడాలని కోరారు.