Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జడ్చర్ల
ప్రభుత్వం వ్యవసాయని కరెంటు సరిగ్గా ఇవ్వడం లేదని మండల పరిధిలోని గంగాపురం గ్రామానికి చెందిన రైతులు గురువారం కల్వకుర్తి ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ప్రభుత్వం రైతులకు24గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుందని కానీ వాస్తవానికి కేవలం 6గంటలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. అది కూడా అర్థరాత్రి12 గంటల తరువాత 2గంటలు, తెల్లవారు జామున 4గంటలకు మరో 2గంటలు, ఉదయం 10 తరువాత 2గంటలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం12గంటల కరెంటు సమయపాలన పరంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కరెంటు సరిగ్గ రాకపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయని దిక్కుతోచని స్థితిలో ఉన్నామన్నారు. కరెంటు అధికారులను అడిగితే సమాదానం సరిగ్గా ఉండదని తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని అన్నారు. ధర్నా చేసిన వారిలో బండారి యాదయ్య చుక్క హరీష్. చుక్క నరసింహులు. చెన్నయ్య గౌడ్. చుక్క మల్లేష్. రాజు రెడ్డి. సైదా మోని కృష్ణయ్య. రణమోని యాదయ్య. రాజు తదితరులు పాల్గొన్నారు.