Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధికి తగ్గించిన నిధులు
- వైద్య పరిశోధనలు ప్రయివేటుకు
- నిరాశా మిగిల్చిన కేంద్ర బడ్జెట్
45 లక్షల కోట్ల బడ్జెట్లో పాలమూరుకు ప్రత్యేకంగా దక్కిందేమి లేదు. ఎన్నికల కోసమే బడ్జెట్ రూపొందించినట్లుగా ఉంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదాలబిస్తోందని మేధావులు, ఉద్యమ నాయకులు ఆశించారు. తీరా బడ్జెట్ చూసిన తర్వాత పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా లేదని, కనీసం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం నుంచి ఒక ప్రకటన సైతం రాకపోవడంతో జిల్లా రైతులు, ఆశావాహులు మండిపడ్డారు. ముఖ్యంగా ఉపాధి, వైద్య రంగాలకు సైతం నిధుల లేమితో ఆయా రంగాలు కూనరిల్లే అవకాశాలు ఉన్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
ఉమ్మడి పాలమూరుతో పాటు రంగారెడ్డి, నల్లగొండ, వికారాబాద్ జిల్లాలకు సాగునీరు హైదరాబాద్‌కు తాగునీటిని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం పాల మూరు రంగారెడ్డిని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రాష్ట్రం ఏర్పాటు సమయంలోనే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని బీజెపీ హామీ ఇచ్చింది.రాష్ట్రం ఏర్పడి 9ఏండ్లు కావస్తున్నా...ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించడం లేదు. కేంద్ర బడ్జెట్ రూ. 45 లక్షల కోట్లకు ప్రకటించి అందులో జిల్లా సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వక పోవడం దారుణమని ఉద్యమ కారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాది హామీ పథకం నీరు గార్చే విదంగా వ్యవహరిస్తోంది. గత బెడ్జెట్ కంటే ఈసారి 30 వేల కోట్లు తక్కువగా కెటాయించారు. అరకొర నిధులు కెటాయించడంతో ఉపాది కూలీలకు పనులు దొరకడం లేదు.దీంతో ఉపాది హామీ పథకంల లక్ష్యం అయిన వలసలు నివారణ చర్యలు శూన్యంగా మారనున్నాయి. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో పరిశోధనలను గాలికి వదలిపెట్టారు. ఈ రంగాన్ని పూర్తిగా ప్రయివేటుకు అప్పగించారు. దీంతో పరిశోధనలు ప్రయివేటు చేయడంతో వైద్యం పేదలకు అందే అవకాశాలు లేవని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అతిపెద్ద రంగమైన వ్యవసాయం కోసం అరకొర నిధులు కేటాయించారు. రూ. 20 లక్షల కోట్లు ఏమాత్రం సరిపోవు. సప్తరుషుల పేరుతో రూపొందించిన బడ్జెట్ ప్రధానమైన ఏడు రంగాలకయినా ఉపయోగ పడటం లేదు. అమృత కాలంలో తీసుకొచ్చిన బడ్జెట్ పేదలను ఆదుకుంటుందన్న బరోసా లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ పట్ల కపట ప్రేమ
పక్కనే ఉన్న కర్నాటక సాగునీటికోసం 15వేల కోట్లు కేటాయించి తెలంగాణ పట్ల అన్యాం చూపుతున్నారు.ఈ ఏడాదిలో అక్కడ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బడ్జెట్ పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి కోసం ఎందుకు నిధులు కేటాయించలేదని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఉమ్మడి జిల్లాలో కోయిల్‌సాగర్, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్వహణ కోసం సైతం నిధులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రకటించిన బడ్జెట్‌ను పున సమీక్ష చేయాలని పలువురు కోరుతున్నారు.