Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మహబూబ్ నగర్
పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ మరియు ఎస్.ఐ భర్తీ క్రమంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు 6 రోజులు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. రాష్ట్ర డీజీపీ అంజన్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా స్టేడియం మైదా నాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రిలిమినరీ పరీక్ష నందు 7 మార్కులు కలిపినందుకుగాను తెలంగాణ రాష్ట్రంలో అర్హత పొందిన అభ్యర్థులకు పరీక్షలు 15.02.2023 నుండి 21.02.2023 వరకు 6 పనిదినములు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత సిబ్బందితో జిల్లా స్టేడియం గ్రౌండ్ ను సిద్ధం చేయమని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మొత్తం 6275 అభ్యర్థులు అర్హత పొందగా 4512 మంది పురుషులు 1763 మంది మహిళలు హాజరవుతారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు, మహేష్ , శ్రీనివాసులు, ట్రాఫిక్ ఇన్స్పెక్ట్టర్ అశోక్, రిజర్వు ఇన్స్పెక్టర్స్ సురేష్, అప్పల నాయుడు టెక్నికల్ టీమ్ ఎస్సై రాఘవేందర్ సిబ్బంది పాల్గొన్నారు.