Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నాయకులు ఎర్రశేఖర్
నవతెలంగాణ- బాలానగర్
కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తల జోలికి వస్తే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఖబర్దార్ లని కాంగ్రెస్ నాయకులు ఎర్రశేఖర్ అన్నారు. గురువారం బాలానగర్ మండల కేంద్రంలో సర్పంచ్ ఇంట్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు కార్య కర్తల జోలికి వస్తే ఊరుకునే సమస్య లేదన్నారు. రాబోయే రోజుల్లో జడ్చర్ల నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. జడ్చర్ల నియోజక వర్గంలో ఉన్న ప్రభుత్వ భూములన్ని అన్యాత్రమవుతున్నాయని తమ వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు.ప్రజాధనాన్ని దోచుకుంటున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు తల దింపుతామని ఆయన మండిపడ్డారు. 50 గజాల నుండి ఎకరా భూములను లాక్కుంటున్నారని పద్ధతిని మార్చుకోవాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతి, రవీందర్ రెడ్డి, తిరు మలగిరి మాజీ సర్పంచ్ హనుమంతు నాయక్,పెంటే నాయక్. భాస్కర్ గౌడ్ ,పలువురు ఉన్నారు.