Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్ నగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అల్ ఫైజ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జహంగీర్ కోరారు. కంటి వెలుగుపై జిల్లా కేంద్రం సద్దలుండ్ ప్రాంతంలో సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జహంగీర్ బాబా మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడు తుందన్నారు. ప్రభుత్వ ఖర్చుతో ప్రజల కోసం ఉచితంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డాక్టర్ గౌతమి, డాక్టర్ సువిత, పావని, కృష్ణవాణి, ఏఎన్ఎం బుజ్జి, లక్ష్మి ,సావిత్రి, అరుణ, గౌతమి,అంగన్ వాడి టీచర్లు, నిర్మల ,రిజ్వాన, పద్మ, ఆర్ పి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.