Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
నవతెలంగాణ -ధరూర్
జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ.. 1956 కంటే ముందు వాల్మీకులు ఎస్టీ జాబితో ఉన్నారని ఎనిమిది యేండ్ల నుంచి వాల్మీకులను ద్రోహం చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ నుంచి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి పూర్తి సహకారం ఉంటుందన్నా రు. చల్లప్ప కమిషన్, ఆధారంగా క్యాబినెట్ ఆమోదంతో కేంద్రానికి పంపే బాధ్యత బీఆర్ఎస్ తీసుకోవాలన్నారు. కేంద్రం దగ్గర నుంచి సమాచార హక్కు చట్టం కింద సమాచారం తీసుకొంటే నేటికీ రాష్ట్రం నుంచి ఎస్టీ జాబితా నివేదికను పంప లేదని, నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కాంగ్రెస్‌కి చిత్తశుద్ధి ఉందని, ప్రస్తుతం బీఆర్ఎస్ ఆ చిత్తశుద్ధి లేదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అన్నారు. వాల్మీకులపై పూర్తి చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్ అని అందుకే శాసన సభలో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అటు పార్లమెంట్లో నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడి వాల్మీకుల చిరకాల ఆకాంక్ష ఎస్టీ డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేశారని సంపత్ కుమార్ అన్నారు. వాల్మీకుల హక్కులను కాపాడే దిశగా 2014 -2018 కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాల్మీకి ఎస్టీ డిమాండ్ మేము చేస్తాామని ప్రకటించామన్నారు. ఈ కార్యక్రమంలో బల్గెరా నారాయణ రెడ్డి, ఎన్ ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాత, కౌన్సిలర్ శంకర్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇసాక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జియ్యన్న, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దీపక్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షుడు నాగశిరోమణి, దేవేందర్, ఫీరోజ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.