Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కందనూలు
మహాత్మ గాంధీ ఆశయాలు ముందుకు తీసుకెళ్లడానికి యువత నడుం బిగించాలని రాష్ట్ర గాంధీ స్మారక నిధి అధ్యక్షులు జీవీ సుబ్బారావు, జిల్లా రవాణా శాఖాధికారి ఎర్రస్వామి అన్నారు. గురువారం మహాత్మాగాంధీ 75వ వర్ధంతి సం దర్భగా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 12 వరకు సర్వోదయ దివస్ కార్యక్రమంలో భా గంగా పట్టణంలోని షిరిడీసాయి పారా మెడికల్ కాలేజీలో వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్, గాంధీ స్మారక నిధి, హైద రాబాద్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమసవేశంలో ముఖ్య అతిథులుగా వారు పాల్గొని మాట్లాడారు. మన గ్రామాన్ని మ నమే అభివృద్ధి చేసుకోవాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆనాడే మహాత్మ గాంధీ తెలి యజేశారని పేర్కొన్నారు. విద్యార్థులు మహా త్మా గాంధీ జీవిత చరిత్ర పుస్తకాలను చదివి దాంట్లో ఉన్న సూత్రాలను పాటించాలని అన్నారు. విద్యతోపాటు సేవా దృక్పథం అలవర్చుకోవాలని, పారామెడికల్ కాలేజీలో చదువుతున్నందుకు పరిశుభ్రం గురించి గ్రామాలలో తెలియజేయాలని, మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీ వంతు కృషి చేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జీవీ రామకృష్ణ, కార్యదర్శి సంపత్ కుమార్, ఆర్గనైజర్ అనిత కాలేజి కమిటీ అధ్యక్షుడు సైదులు, సిబ్బంది ,విద్యార్థులు పాల్గొన్నారు.