Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవ తెలంగాణ -కందనూలు
కేంద్ర బడ్జెట్‌ను సవరించాలని తెలంగాణ రైతు సంఘం నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ చౌక్ లో నిరసన చేపట్టారు. అనంతరం రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసారంగానికి తీవ్ర నష్టం కలిగే విధంగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయన్నారు. గత సంవత్సరం కన్నా ప్రస్తుతం కేటా యింపులు తక్కువగా ఉన్నాయన్నారు. దీంతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళుతుందని విమర్శించారు. గత సంవత్సరం బడ్జెట్లో ఎరువుల సబ్సిడీలకు కేటాయించిన దానికన్నా 2023- 24 సంవత్సరానికి దాదాపు రూ.50 వేల కోట్లు ఎరులపై సబ్సిడీ తగ్గించారని దేశవ్యాప్తంగా ఎరువులపై ధరలు పెరిగాయ న్నారు. గత సంవత్సరం మొత్తం బడ్జెట్ 39 లక్షల 44 వేల 48 కోట్లుగా ఉండగా ప్రస్తుత బడ్జెట్ 45,,03,097 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారనిచ,దీంతో దేశవ్యాప్తంగా రైతులు, కూలీలు సాధారణమైన ప్రజానీకం కార్మికులకు ఎలాంటి లాభం లేదని ప్రజలపై అధికంగా భారాలు వేసే బడ్జెట్‌గా ఉందని విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం 89 వేల కోట్లు కేటాయిస్తే ప్రస్తుత సంవత్సరం 60 వేల కోట్లు కేటాయించడం వలన దేశవ్యాప్తంగా కూలీలకు పని దినాలు తగ్గి మళ్లీ వలసలు వెళ్లే పరిస్థితి ఉంటుందన్నారు. వెంటనే బడ్జెట్ సవరించి అధిక నిధులు కేటాయించాలని అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను సవరించి వ్యవసాయ రంగానికి , కార్మిక రంగానికి , ఈజీఎస్ , ఆహార భద్రత, ఎరువులు, పంట రుణాలు, పరిశోధనలకు అధికంగా నిధులు కేటా యిం చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిలుక బాల్‌రెడ్డి సహాయ కార్యదర్శి నాగరాజు గౌడు జిల్లా కమిటీ సభ్యులు వి వెంకటేష్ తారా సింగ్ కార్తీక్ వెంకటస్వామి రైతులు పాల్గొన్నారు.