Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వల్లూరు క్రాంతి
నవతెలంగాణ -ధరూర్
పునరావాస కేంద్రాల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించా రు. గురువారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశంలో జిల్లాలోని పునరావాస కేంద్రాలైన ర్యాలంపాడు, నాగర్ దొడ్డి, ఆలూరు, చిన్నోనిపల్లె సెంట ర్లలలో పనులు వేగంపెంచాలన్నారు. స్క్రుటిని ఏ విధంగా చేస్తున్నా రు, ఆర్ఆర్ సెంటర్లలో లే అవుట్ ప్రకారం 820 ప్లాట్ల వచ్చేటట్లు చూడాలని, ర్యాలంపాడు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పనులు మొ దలు పెట్టాలని, రివైజేడ్ ఎస్టిమేట్ ఇవ్వాలన్నారు. డ్రైనేజీలు, నీట ిసరఫరా, రోడ్లుకు సంబంధించిన పనులు వెంటనే పూర్తిచేయాలన్నా రు. ర్యాలంపాడు గ్రామస్తులతో మాట్లాడి ఫార్మ్ సి తీసుకోవాల న్నా రు. ప్రభుత్వం నుంచి అప్రూవల్ అయిన లిస్టు పంపించాలన్నారు. అధికారులు గ్రామ సర్పంచులను, గ్రామ పెద్దలను తెసుకొని వెళ్లాలని, గ్రామస్తులతో మా ట్లాడి దేవాలయానికి సంబంధించి పనులు మొదలు పెట్టాలన్నారు. నాగర్ దొడ్డి లో మంజూరైన పనులు మొదలు పెట్టాలని, మిషన్ బగీరథ ద్వారా 820 కుటుం బాలకు వాటర్ సప్లై అయ్యేటట్లు చూడాలని, చిన్నోన్నిపల్లి, గట్టు లిఫ్ట్ ఇరిగే షన్ పనులను ఆలస్యం చేయకుండా సంబంధిత ఇంజనీర్లు పనులు చేయిం చాల న్నారు. పెండింగ్ పనులను ప్రాధాన్యతగా బావించి పూర్తిచేయాలని, ప్రతి వారం పూర్తిచేసిన పనులకు సంబంధించిన నివేదికలు పంపాలని ఆదేశించారు. అదేవి ధంగా ఖరీఫ్ సీజన్లో పత్తి వేసే రైతులు నష్టపోకుండా విత్తన సమస్యలు రా కుండా చూడాలని కలెక్టర్ సీడ్ కంపెనీ ప్రతినిధులకు ఆదేశించారు. గురు వారం కల్లెక్టరేట్లో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో ఏర్పాటుచేసిన సమా వేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నష్టపోయిన పత్తిరైతుల పొల్లాలో శాస్త్రవే త్తలు పరిశీలించి ఇచ్చిన నివేదికల ఆదారంగా నష్టపరిహారం చెల్లించాలని, భవిష్యత్‌లో విత్తన సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత సీడ్కంపెనీ వారి దేనని, రైతుల కు సీడ్ ఇచ్చేటపుడు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని కోరారు. జిల్లాలో 2,22 000 వేల ఎకరాలలో రైతులు పత్తిసాగు చేస్తున్నారని, ఎక్కడైతే దిగుబడి సమ స్య ఉన్న ప్రాంతాలలో శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిం చి వారి నివే దిక ఆధారంగా కంపెనీ వారిగా, రకం వారిగా వాటిల్లిన నష్టం గురిం చి సీడ్ కం పెనీ వారిని నష్ట పరిహారం చెల్లించేందుకు ప్లాన్ చేసుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లాలో ఆయిల్ ఫాం విస్తీర్ణపథకం కింద లక్ష్యంగా నిర్ణయించిన ఎకరాలలో ఆయిల్‌ఫాం పంటలను సాగు చేసేందుకు జిల్లాకు ఉన్న లక్ష్యాన్ని పూర్తిచే యాల ని కలెక్టర్ అన్నారు. గురువారం కల్లెక్టరేట్లో ఉద్యానవనశాఖ, వ్యవసాయ అధికా రులతో ఆయిల్‌ఫాం సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా లో 2022 -23 ఆర్థిక సంవత్సరానికిగాను ఆయిల్ ఫాం విస్తీర్ణ పథకం కింద 4690 ఎకరాలు లక్ష్యంగా ఉందని, 2367 ఎకరాలలో ఆయిల్‌ఫాం పంటలను సాగుచేసారని, ఇంకామిగిలిపోయిన ఎకరాలలో ఆయిల్ ఫాం పంటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు వచ్చేలా వ్యవసాయ విస్తర ణ అధికారులు కృషి చేయాలని, ప్రతివ్యవసాయ విస్తరణ అధికారి 5ఎకరాల వరకు లక్ష్యం ఉండగా జనవరి, ఫిబ్రవరి రెండు నెలలకు వారికున్న లక్ష్యాన్ని పూ ర్తి చేసేందుకు ఆయిల్ ఫాం పంటలపై రైతు లకు అవగాహన కలిపించి రైతులు ముందుకు వచ్చేలా చేయాలని ఆదేశించారు. మొక్కలకు డ్రిప్ సౌకర్యంకోసం ఎకరాకు 4200 సబ్సిడీ రైతు ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. మండలాల వారీగా సమీక్షిం చారు. డ్రిప్‌కోసం ప్లాంటేషన్ డీడీలు కట్టించాలని, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధి కారులు సమన్వయంతో ఇంకా మిగిలి పోయిన లక్ష్యాన్ని పూర్తి చేయాలనీ అధికా రులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదలశాఖ ఎస్ఈ శ్రీనివాసరావు, రహీముద్దీన్, మిషన్ భగీరథ డీఈ శ్రీధర్‌రెడ్డి, విద్యుత్ అధి కారులు, సంబంధిత అధికారులు, వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, సైంట ిస్ట్లు భారత్ భూషణ్, రామకృష్ణబాబు, ఏడీఏలు సక్రియనాయక్, వెంకట్‌లక్ష్మి, సంగీతలక్ష్మి సీడ్ కంపెనీ ప్రతినిధులు, ఉద్యానశాఖ అధికారి అక్బర్, వెంకట్ లక్ష్మి, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.