Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 75 వేల మందికి 'కంటి పరీక్షలు'
- 16 రోజుల్లో 10284 మందికి కళ్లద్దాల పంపిణీ
- మరో 9 వేల మందికి ప్రత్యేక అద్దాలు అవసరం
నవ తెలంగాణ - వనపర్తి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'కంటి వెలుగు' రెండో విడత కార్యక్రమం జిల్లాలో విజయ వంతంగా కొనసాగుతోంది. జనవరి 19వ తేదీన ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 'కంటి వెలుగు'ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కంటి వెలుగు ప్రారం భమై నేటికీ 16 రోజులు గడిచింది. ఇప్పటి వరకు వనపర్తి జిల్లాలో 75,606 మందిని కంటి వైద్య నిపుణులు పరీక్షించారు. ఇందులో 10,284 మందికి కళ్లద్దాలను పంప ిణీ చేశారు.అలాగే ఇతర సమస్యలతో బాధపడుతున్న బాధితుల కోసం 9648 మందికి ప్రత్యేకంగా కంటి అద్దాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు చేపట్టిన శిబిరాల ద్వారా 4603 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని ఆప్తాల్మిక్ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి రెఫర్ చేశారు.
4520 మందికి చికిత్స
జిల్లా వ్యాప్తంగా గురువారం చేపట్టిన కంటి వెలుగు శిబిరాల ద్వారా 4520 మందికి కంటి వైద్య నిపుణులు చికిత్స అందించారు. ఇందులో 557 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. మరో 585 మందికి ప్రత్యేకమైన కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. అలాగే 235 మందికి కంటి శస్త్ర చికిత్స అవసరమని గుర్తించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవిశంకర్ తెలిపారు. కంటి వెలుగు ప్రోగ్రాంలో భాగంగా కంటి వెలుగు శిబిరాలను కంటి వెలుగు పర్యవేక్షణ అధికారి డాక్టర్ సాయినాథ్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.