Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిమ్మాజిపేట : యాదాద్రి నుంచి బయల్దేరి వచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాలకు భక్తులు బ్రహ్మరథం పట్టారు. మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన భక్తులు స్వామివారి వ్రతానికి ఘన స్వాగతం పలికి భక్తి పార వశ్యమ్తో పులకించిపోయారు. ఈ నెల 12న జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంజీఆర్ ట్రస్ట్ సామూహిక వివాహల నిర్వహి స్తున్నారు. సామూహిక వివాహాల ముందు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనర సింహస్వామి ఉత్సవ విగ్రహాలను నాగర్‌కర్నూల్ సామూహిక వివాహ కల్యాణ మండపానికి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు శని వారం సాయంత్రం జిల్లా ముఖద్వారం మరికల్ గ్రామానికి చేరుకోగానే ఆయా గ్రామాలకు చెందిన భజన మండలి సభ్యులు భక్తులు ప్రజాప్రతినిధులు నాయకులు మరికల్‌కు తరలివచ్చారు.రథోత్సవంలో ఉన్న స్వామివారి ఉత్సవ విగ్రహాలకు మ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు భక్తులు పూజలు నిర్వహించారు.శోభాయాత్రలో అప్పాజీపల్లికి ఇప్పలపల్లి, చెందిన చిన్నారులు వేసిన కోలాటం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి జడ్పిటిసి దయాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, వైస్ ఎంపీపీ శ్రీనివాసులు, రైతు సంఘం అధ్యక్షుడు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.