Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -గట్టు
మండల పరిధిలోని బలిగెర గ్రామానికి చెందిన డ్రైవర్స్ సునంద్ (35) గతమూడురోజుల క్రితం సాయంత్రం ఏడుగంట ల కు ఇంటి నుంచి బయటికి వెళ్లి వస్తానని భార్య సంగీతకు చెప్పి బైకుపై వెళ్లాడు. రాత్రివరకు ఇంటికి రానందున ఎప్పుడులాగానే జీప్డ్రైవింగ్కి వెళ్లి ఉంటాడని అనుకు న్నారు. రోడ్డుపై నుంచి వెళ్తున్న బుజ్జి అనే వ్యక్తి చూసి రాజు అనే వ్యక్తికి ఫోన్ చేసి సునందు బాసు వాళ్లమోటర్ దగ్గర కింద పడి చనిపోయాడని ఫోన్‌చేసి తెలియజేశారు. అప్పుడు కుటుంబ సభ్యులు వచ్చి చూసి ముక్కులో నుంచి చెవిలో నుంచి రక్తం కార్చున్నదని ఇట్టి ప్రమాదం రాత్రి సమయంలో సంభ వించింది. ఆచార సంప్రదాయ ప్రకారం అంతక్రియలు పూర్తి చేశారు. శనివా రం తండ్రి ఫిర్యాదుదారుడు ఉషనయ్యగాల ఫ్రాన్సిస్, తన కుమారుడు సునం దురోడ్డు ప్రమాదంలో చనియాడో ఏ విధంగా చని పోయాడో తమకు తెలియ డం లేదని, పోలీస్‌స్టేషన్‌కి దరఖాస్తు ఇవ్వగా కేసున మోదు చేయ డమైనది. ఇట్టి ఇన్వెస్టిగేషన్లో భాగంగా విషయాన్ని తాసిల్దార్ రవికుమార్, గద్వాల హాస్పిటల్ సూపర్డెంట్ తెలియపరచి తాసిల్దార్ సమక్షంలో బలిగేరా గ్రామా నికి వెళ్లి పూడ్చిన శవాన్ని బయటికి తీసి శవ పంచనామ పోస్ట్‌మార్టం చేసి పూడ్చి వేసినట్లు ఎస్సైపవన్కుమార్ తెలియజేశారు.