Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నర్వ
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించినందుకు సీఎం కేసీఆర్కు వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వాల్మీకి నాయకులు మాట్లాడుతూ.. రాజకీయంగా, ఆర్థిక సామాజిక పరంగా అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడిన వాల్మీకి బోయ కులస్తులను బీసీల జాబితా నుంచి ఎస్టీల జాబితాలోకి చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక వాల్మీకి సంఘం నాయకులు న్యాయ పోరా టానికి స్పందించి నిర్ణయం తీసుకోవడం పట్ల వాల్మీకి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మండల వాల్మీకి నాయ కులు మండలంలోని వాల్మీకి దేవాల యంలో పూజలు నిర్వహించారు. ఈ కా ర్యక్రమంలో వాల్మీకి సంఘం మండల నాయకులు ఎం లక్ష్మణ్, మండల చిన్నయ్య, గడ్డం నరసింహ, సుధీర్, అయ్యన్న, ఉమాపతి, ఆయా గ్రామాల వాల్మీకి సోదరులు పాల్గొన్నారు.
అయిజ : పట్టణంలోని వాల్మీకి దేవాలయ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ చిత్రప టానికి వాల్మీకి సంఘం నాయకులు శనివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సంద ర్భంగా వాల్మీకి బోయ సంఘం సీనియర్ నాయకులు రాందాస్ మాట్లాడుతూ.. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని దశాబ్దాల కాలంగా పోరాటం చేస్తు న్న వాల్మీకి బోయల కష్టాలను గుర్తించిన సీఎం ఎస్టీ జాబితాలో చేరుస్తూ తెలం గాణ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదం తెలుపడం హర్షణీయమని అన్నారు. ప్రభు త్వం ఏకగ్రీవ తీర్మానం చేస్తూ బిల్లును కేంద్రానికి మరోసారి పంప నట్లు కేసిఆర్ వెల్లడించడం సంతోషకరమన్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తూ అన్ని రంగాలు వెనుకబడిన వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చేస్తున్న కృషి ఫలించిందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వాల్మీకి సోదరులు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బట్టల తిమ్మప్ప, గోవిందు, శ్రీనివాసులు, టప్ప తిమ్మప్ప, రవి, తిరుమలేష్, బుడ్డల తిమ్మప్ప, శేఖర్, దాసరి తిమ్మప్ప, వాగుగడ్డ శ్రీను పాల్గొన్నారు.