Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- కందనూలు
కార్మికులకు కనీస వేతన జీవోలు అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భూపాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమల్లో కాల పరిమితి దాటిన జీవోలు అనేకం ఉన్న వాటిని సవరించడంలో వాటిని రీ షెడ్యూల్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన జీవోలు అమలు చేయకుండా చాలీచాలని వేతనాలు కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుం టుందని ఆయన అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 22 కార్మిక చట్టాల ను సవరించి నాలుగు లేబర్ కోడులు తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక క్లస్టర్ ప్రాంతాలలో యాజమాన్యాలకు వత్తాసు పలుకుతూ కార్మికులను తీవ్ర ఇబ్బందుల గురి చేస్తుందని ఆయన అన్నారు. మరొకవైపు వలస 1979 లో వచ్చిన వలస కార్మికుల చట్టం ప్రకారం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు పారిశ్రామిక ప్రాంత కార్మికులకు అదే విధంగా షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమంలో కాల పరిమితి దాటిన జీవోలను వెంటనే సవరించాలని కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వర్ధం పర్వతాలు, డి ఈశ్వర్ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య, మల్లేశ్, దశరథం తదితరులు పాల్గొన్నారు.