Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎంఎల్) ప్రజాపంధా రాష్ట్ర నాయకులు ఎం. కృష్ణ
నవ తెలంగాణ -ఊట్కూర్
భారతదేశంలో మారుతున్న ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులకు అను గుణంగా విశాల ప్రజా పోరాటాలు నిర్వహించాలని సీపీఐ ఎంఎల్ ప్రజా పంధా రాష్ట్ర నాయకులు ఎం కృష్ణ, జిల్లా కార్యదర్శి బి రాము అన్నారు. శనివారం మం డల పరిధిలోనిబిజ్వర్లోని శ్రామిక భవన్లో సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీ మండల మహాసభ నిర్వహించారు. సుత్తి కొడవలి, ఎర్రజెండాను డివిజన్ కార్యదర్శి సలీం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చెన్నప్ప, వెంకటరెడ్డి, ఈశ్వర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యవక్తగా పార్టీ రాష్ట్ర నాయకులు, ఎం కష్ణ, జిల్లా కార్యదర్శి బి రాము, హాజరై మాట్లాడుతూ.. కమ్యూని స్టు పార్టీ కార్యకర్తలు తమ జీవితం తమ కోసమే కాకుండా ప్రజలకోసం అత్యున్నత వరకు పోరాట సిద్ధాంతం కోసం ఆదర్శంగా తీసుకొని వారి పోరాట సిద్ధాంతాన్ని ముందుకు నడవాలన్నారు. 1925లో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ అనేక కుట్ర కేసు ల్ని నిర్బంధాలని అణిచివేతలను నిషేధాలను ఎదుర్కొంటూ ముందుకు పోతుంద న్నారు. కార్మిక కర్షక పోరాటాల నిలబడి ఆంగ్లేయుల సామ్రాజ్యవాదానికి వ్యతిరే కంగా పోరాడుతూ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎన్నో వీరోచిత పోరాటా లు నిర్మిస్తూ వస్తున్నది ఆంగ్లయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జమీందారు జాగ్ర త్తలు వ్యతిరేకంగా ఎన్నో విరోచిత బలమైన కార్మికుల నిర్మించి భారత కార్మిక వర్గా న్ని పోరాటం చేరిందన్నారు. సంస్థానాల్లో జమీందారీ వ్యతిరేక పోరాటాలను నిర్మించింది విద్యార్థి యువజన మహిళారంగ పోరాటం నిర్మించి అంటరాని తనాని కి వ్యతిరేకంగా అణిచివేతలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు నిర్మించి విజయాల ను సాధించిందన్నారు. దళిత పేద వర్గాల తరఫున ఎన్నో స్థానిక పోరాటాలు నిర్వ హించి ప్రజల్లో భాగస్వామ్యమై చైతన్యవంతంగా ఉద్యమాన్ని నిర్మిస్తూ వస్తున్నది. నేడు దేశంలో అమలవుతున్న పెట్టుబడిదారీ విధానాలతో సంక్షోభాలు తీవ్రమై తున్న తరుణంలో కార్మిక రైతాంగ ఉద్యమాలు ఒకవైపు వారి డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా నిరంకుశంగా అణిచివేస్తున్నది. విద్య వైద్యం ఉపాధి ప్రజల కనీస అవసరాలు తీరడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు దాసోహమై వారి లాభాలే వారి అభివృద్ధి దేశ అభివృద్ధిని కీర్తిస్తూ ఉందన్నారు. మోడీ అప్రజా స్వమిక, నిరంకుశ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా, విశాల ఐక్య పోరాటాలను ప్రజాస్వామ్య హక్కులపరిరక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సభలను డివిజన్ కార్యదర్శి సలీమ్ ప్రారంభో ఉపన్యాసం చేశారు ఈ కార్యక్రమంలో, డివిజన్ నాయకులు కాలేశ్వర్, బోయిన్పల్లి రాము సిద్దు, గోవర్ధన్ రెడ్డి, పొర్ల నరసింహ, సర్పంచులు జీ. సావిత్రమ్మ, కృష్ణయ్య, ,అంజప్ప, కనక రాయుడు నరసింహ, లక్ష్మణ్ బాలకిషన్ గౌడ్ , తిరుపతి మండల నాయకులు పాల్గొన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఊట్కూర్ మండల కార్యదర్శిగా పి. రామాంజనేయులు, సహాయ కార్యదర్శిగా ఈశ్వర్‌తో పాటు 17మంది కమిటీ సభ్యులుగా ఎన్నికైయ్యారు. ఈ సభలో పెద్దపోర్ల, నిడుగుర్తిఆవుసలోనిపల్లి, పులిమామిడి, పెద్దజట్రం కొత్తపల్లి వివిధగ్రామాల ప్రజాపంథాపార్టీ నాయకులు, భవన నిర్మాణ, బీడీ కార్మిక, విద్యార్థి, యువజన, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.