Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ అరగోపాల్
నవతెలంగాణ -మరికల్
ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని పాదయాత్ర ప్రారంభించిన ప్రొఫెసర్ అరగోపాల్ అన్నారు. శనివారం మండలంలోని చిత్తనూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఇథనాల్ కంపెనీ నుంచి వచ్చే నష్టాలు గురించి ప్రజలకు తెలియజేశారు. రద్దు చేయాలని, ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని, నినాదాలు చేస్తూ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. చిత్తనూరు గ్రామం ఉదయం 10 గంటల నుంచి దమగ్నాపూర్, మార్కాపూ ర్, కుమ్మరిలింగంపల్లి, రాంపూర్, లంకాల, గ్రామాల వీధుల గుండా పాద యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కంపెనీ వ్యతిరేక పోరా ట కమిటీకి మద్దతు తెలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాయ వేదిక జిల్లా కన్వీనర్ వెంకట్రాములు, సుదర్శన్, కేన్బీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షు డు డి చంద్రశేఖర్, జీఎస్టీయూ జిల్లా కార్యదర్శి యాదగిరి, ఆల్ ఇండియా కన్వీనర్ బండారిలక్ష్మయ్య, చిత్తనూర్ మండలి మురళి, రామచం ద్రయ్య, మణి వర్ధన్‌రెడ్డి, లింగయ్య, దేవేందర్‌రెడ్డి, రైతు సంఘాల నాయకు లు, వివిధ గ్రామాల మహిళలు, రైతులు సంఘాల నాయకులు పాల్గొన్నారు.