Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- నారాయణపేట టౌన్
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పాపన్నగారి మాణిక్ రెడ్డిని గెలిపిం చుకుందామని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కే. రవికుమార్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు కే శివరాములు అధ్యక్షతన సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.. మార్చి 13న జరగబోయే మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న పాపన్న గారి మాణిక్‌రెడ్డి గెలుపుకోసం మనమందరం కృషి చేద్దామని అన్నారు. ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కోసం పేదప్రజల విద్యారంగా అభివృద్ధికోసం శాసనమండలిలో తన వాణిని బలంగా వినిపించే నాయకుడుగా మాణిక్ రెడ్డి ఉంటారని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయ ఉద్యమంలో మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి అంచలంచలుగా ఎదిగాడన్నారు. గత ఉపాధ్యాయ ఎన్నికలలో పోరాడి రెండో స్థానంలో నిలిచారని ఆనాటి నుంచి నేటివరకు ఉపాధ్యాయ సమస్యలపై వివిధ పోరాటాలు ముందుండి చేశారని అన్నారు. అధికార పత్రిక వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ ప్రధాన సంపాదకులుగా పనిచేస్తున్న పాపన్న గారి మాణిక్ రెడ్డిని గెలిపించుకుందామని అన్నారు. పండిత పీఈటీలకు ప్రమోషన్లు ఇచ్చి ఆ సమస్యను త్వరితగతిన ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 317 బాధిత ఉపాధ్యాయులకు తమ సొంత జిల్లాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో సీపీఎస్ విధానం రద్దుచేసి ఓపీఎస్ విధానాన్ని అమలుపరిచి ఉపాధ్యాయ కుటుంబాలకు సామాజిక భద్రతను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కే. బాలాజీ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, జిల్లా కార్యదర్శులు రాజేష్, గోవింద్, ఎస్. రవికుమార్, వెంకట్ నాయక్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
కందనూలు: మార్చి 13న జరుగబోవు మహబుబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్ యూటీఎఫ్ బలపరుస్తున్న అభ్యర్థి పాపన్నగారి మాణిక్ రెడ్డిని గెలిపించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్హాలులో జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న టీఎస్, యూటీఎఫ్ పక్షాన పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు, వాయిస్ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రిక ప్రధాన సంపాదకులు పి.మాణిక్‌రెడ్డి ఎన్నికలో పోటీ చేస్తున్నారని, ఉపాధ్యాయుల సంక్షేమంకోసం నిరంతరం పాటుపడుతున్నారని విద్యావ్యవస్థపై సంపూర్ణ అవగాహన కలిగిన మాణిక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైతే విద్యారంగ సమస్యల పరిష్కారంకోసం మరింత కృషిచేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాఎం. శ్రీధర్‌శర్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.చిన్నయ్య, కె.శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం రమాదేవి, కో-శాధికారి జె.బాల్‌రాజు, జిల్లా కార్యదర్శులు ఎన్.చంద్రశేఖర్, పి.రామేశ్వరయ్య, ఆర్.రాంచంద్రు, ఆర్.లలితాబాయి, ఆర్.లక్ష్మణ్, ఎం శ్రీనివాస్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎన్.నెహ్రూప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.