Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ సివిల్ జడ్జి కమలాపురం కవిత
అలంపూర్: న్యాయస్థానాలు నిర్వహించే లోక్ అదాలత్ ద్వారా వివాదా ల ను పరిష్కరిం చుకోవచ్చునని జూనియర్ సివిల్ జడ్జి కమలాపురం కవిత అన్నా రు. శనివారం అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టులో లోక్ అదాలత్ ని ర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసులను సత్వరమే పరిష్కరించి బాధితుల మధ్య రాజీ కుదిర్చేందుకు కోర్టులు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాయని, లోక్ అదాలత్ ద్వారా బాధితుల పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించు కోవచ్చునని తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా 93 వివాదాలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. బాధితుల పరస్పర రాజీ వల్ల 24 కేసులు పరిష్కారం అయ్యాయని, అపరాధ రుసుము ద్వారా 67 కేసులు, రెండు సివిల్ వివాదాలు పరిష్కారమ య్యావని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా అపరదరసము 1 లక్ష 52 వేల ఒక వంద రూపాయలు వచ్చాయని లోక్ అదాలత్ ఇంచార్జి సాయి తేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీపీ కార్తీక్ రాజు తదితరులు పాల్గొన్నారు.