Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నారాయణపేట టౌన్
వడ్డెర సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న నాయకులను ముందస్తుగా పేట పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం గౌరవ అధ్యక్షులు దత్తు మాట్లాడుతూ వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎన్నో సంవత్సరాలుగా నిరసనలు నిరాహార దీక్షలు చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పైబడినను వడ్డెర జాతి బతుకులు దిన దినంగా మారుతున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడితే తెలం గాణ ప్రజల బ్రతుకులు మారుతాయని భావిస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. అర్హులైన వడ్డెర కులస్తులకు రూ.5వేలు పింఛన్ మంజూరు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేసి రెండు వేల కోట్లు కేటాయించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వడ్డెర కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, వడ్డెర కులానికి బండలగుట్టలు క్వారీలపై పూర్తి హక్కు కల్పించాలని కోరారు. వడ్డెర కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే 20 లక్షల ఎక్స్ప్రెస్ ఆ ప్రభుత్వం చెల్లించాలన్నారు. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన కార్యదర్శి వేముల గంగాధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్యమ్మ, సలహాదారులు వల్లపు లక్ష్మయ్య, వడ్డే చిన్న భీమయ్య, వెంకట్రాములు, మాసనమ్మ, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.