Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు
- బ్యాంకు నుంచి లక్ష రూపాయలు లోన్లు
- మహిళ స్వయం సహా ఎదగటానికి చేయూత..
మహిళలు అభివృద్ధి చెందితేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని మహిళాలు నిరూపించారు. ఎదుగుదల కుటుంబాలను ఉన్నత స్థితికి తీసుకువెళ్తావే మహిళా అక్షరజ్ఞాన అయ్యుంటే కుటుంబమంతా అక్షరాస్యత సాధిస్తుందని వారి నమ్మకం. అందుకే మహిళా అభివృద్ధి చెందితేనే కుటుంబంతోపాటు మండలం రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందుతాయి. మహిళ లేని రంగంలో లేనేలేదు అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారాలు అందిస్తున్నాయి
నవతెలంగాణ- తాడూర్
తాడూర్ మండల మహిళా సమైక్య వివో సంఘాలు 27 మండలంలోని మొత్తం స్వయం సహాయక సంఘాలు 588 మొత్తం స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు 6,433 సభ్యులు ఉన్నారు. మహిళల అభివృద్ధి కోసం గత సంవత్సరం 2021 22 లో బ్యాంకు లోన్లు, 316 సంఘాలకు 1420 కోట్ల రూపాయలు బ్యాంకులిచ్చారు. అదేవిధంగా వరి కొనుగోలు చేయడం కోసం రెండు సెంటర్రు ఒక ఐతోల్ రెండు గోవిందా పెళ్లి గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐతోలు సెంటర్లో 48,392 గన్ని బ్యాగులకు ఇచ్చారు. వరి క్వింటాలు 1935 6.80 వారిని కొనుగోలు చేశారు. అందుకుగాను రైతుల ఖాతాలో 39875008 రూపాయలు వేశారని రైతులు తెలిపారు. అదేవిధంగా గోవిందపల్లి సెంటర్లో గన్ని బ్యాగులు 15084 ఇవ్వడం జరిగింది. వరి క్వింటాలు 6033.60 కొనుగోలు చేసి 111 రైతుల ఖాతాలో12429216 అకౌంట్లో వేశారని గుర్తుచేశారు. ఈ విధంగా మహిళలచే వ్యాపారాలు చేయించి మహిళా సంఘాలు అభివృద్ధి చెందడంలో మహిళా మహిళా మండలి సమైక్య ఏపీఎం తిరుపతయ్య అన్నారు.
నాకెంతో సంతోషంగా ఉంది: విజయ, గ్రామస్తురాలు
తాడూరు మండల కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంకు ద్వారా లక్ష రూపాయలు లోను తీసుకొని సొంతంగా లేడీస్ కార్నర్ ఏర్పాటు చేసుకున్నాను. నేను ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా 25 వేలు ప్రతి నెలకు సంపాదిస్తున్నాను.
నెలనెలకు బ్యాంకులో కట్టడం : లావణ్య, గ్రామస్తురాలు
మంజునాథ సంఘం సభ్యురాలిని. బ్యాంకు నుంచి లక్ష రూపాయలు లోను తీసుకున్న సొంత వ్యాపారం చికెన్ సెంటర్ తాడూరు మండల కేంద్రంలో పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాను. మొత్తం ఖర్చులు పోగా నెలకు 12 వేల రూపాయలు ఆదాయం వస్తుంది. బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలు నెలకు 2500 అప్పు చెల్లించి 100 రూపాయలు పొదుపు చేసుకుంటున్నాం.
మహిళ స్వయం సహా ఎదగటానికి చేయూతనిస్తుంది. : తిరుపతయ్య
ఏపిఎం మహిళలను అభివృద్ధి పరచడానికి వారి కుటుంబానికి అండగా ఉంటుంది. మహిళ స్వయం సహా ఎదగటానికి చేయూతనిస్తుంది. గతంలో 60 సంవత్సరాలు పైబడిన వారిని సభ్యులుగా ఉన్న వారిని తొలగించారు.ప్రస్తుతం ఇప్పుడు 60 సంవత్సరాలు పైబడిన వారికి కూడా మహిళా సంఘం లో చేర్చుకోవచ్చని అవకాశముంది.