Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణంలో అవినీతి జలగలు
- పేదల కిచ్చిన స్థలాలు వదలని గద్దలు
- ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న అక్రమ కాంప్లెక్స్
- నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదా !
బతుకలేని వారికి గూడు లేని వారిని ఆదుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన స్థలాలపై పెద్దల కన్ను పడింది. పెద్దల డబ్బుకు అధికారం తోడైతే ఇంకేముంది ఎలాంటి అనుమతులు లేకుండా ఇండ్ల నిర్మాణాలు జరుగుతాయని పలువురు ఆరోపించారు.
నవ తెలంగాణ- జడ్చర్ల
జడ్చర్ల పట్టణంలో ఎటు చూసినా ఇష్టానుసారంగా ఇంటి నిర్మాణాలు జరగడంతో పాటు ఎలాంటి అను మతులు కూడా లేకుండానే కడుతున్నారంటే ఇంతకంటే అవినీతి ఇంక ఎక్కడైనా ఉంటుందా అని ప్రజలు బహిరంగంగా పాలకులను విమర్శిస్తున్నారు. అసలు విషయానికి వస్తే బాదేపల్లి పట్టణంలో సర్వే నంబర్ 11లో2004 సంవత్సరం కంటే ముందు నుంచి పేదలు ఇండ్లు నిర్మించుకునేందుకు పట్టాలు అందజేశారు. ఇన్నాళ్లు అక్కడ మైనార్టీలు, బీసీలు దళితులు బుడగ జంగాల కులాల చెందినవారు ఉండడంతో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఇటీవల ప్రధాన రహదారి విస్తరించడంతోపాటు జాతీయ రహదారికి కేవలం రెండు కిలోమీటర్ల దూరం ఉండడంతో ఈ ప్రాంతం అభివద్ధి చందు తొండడంతో కొందరు బడా వ్యాపారుల కన్ను ఈ స్థలాలపై పడింది. ప్రధాన రహదారిపై దాదాపు 300 గజాల స్థలం కొందరు నాయకులు మధ్యవర్తిత్వం చేసి అసలైన పట్టాదారులకు నయానో భయానో ముట్టజెప్పి పట్టాలు లాక్కొని నోటరీ చేయించి ఎలాంటి అనుమతులు లేకుండానే బడా కాంప్లెక్స్ నిర్మాణానికి తెర లేపారు.అసలు నిబంధనల మెరకు ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ముందుగా తహసీల్దార్ కార్యాలయం నుంచి అధికారులు వెళ్లి పరిశీలన చేసిన తర్వాత ఆ దరఖాస్తు మున్సిపాలిటీ అధికారులకు ఫార్వర్డ్ చేస్తారు. మున్సిపాలిటీ అధికారులు వచ్చిన దరఖాస్తు స్క్రూట్ ని చేసి అనుమతులు ఇస్తారు. ఇల్లు నిర్మాణదారుడు ఇచ్చిన ప్లాన్ ప్రకారం కాకుండా నిబంధనలకు అధిక్రమించి ఇంటి నిర్మిస్తేనే అధికారులు విజిలెన్స్ అధికారులు అక్కడికి వెళ్లి ఆపేస్తారు. కానీ జడ్చర్ల పట్టణంలో ఏడవ వార్డులను నిర్మిస్తున్న కాంప్లెక్స్ ను తమ దష్టిలో లేదని అధికారులు చెబుతున్నా వార్డు కౌన్సిలర్ గాని మున్సిపల్ అధికారులు కానీ ఎందుకు ఆపడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈ నిర్మాణాల వెనక ఒక మహిళ నాయకురాలి భర్త పార్టీ మారిన నాయకుడు ఉన్నాడని తెలుస్తుంది.
నోటీసులు ఇస్తాం
మౌలానా అబ్దుల్ కలాం కాలనీలో నిర్మిస్తున్న కాంప్లెక్స్ సంబంధించి మాకు ఎలాంటి సమాచారం లేదు. నిర్మాణం ఆపేసి వారికి నోటీసులు ఇవ్వడం జరుగు తుంది.
- షైక్ మహమ్మద్, జడ్చర్ల కమిషనర్