Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహమ్మదాబాద్ : ఉన్నత పాఠశాలలో పండిత, వ్యామయ ఉపాధ్యాయుల పోస్టుల ప్రక్రియను పూర్తి చేయాలని తక్షణ పదోన్నతులు కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రవికుమార్ అన్నారు. బుధవారం మహమ్మదాబాద్, గండిడ్ మండలాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని జూలపల్లి, నంచర్ల, వెన్నచేడ్, సల్కరిపేట్, కొమిరెడ్డిపల్లి పాఠశాలల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ విధానాన్ని( సిపిఎస్) రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలని అని సూచించారు. యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పాపన్న గారి మాణిక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. కార్యక్రమంలో మహమ్మదాబాద్ మండల యూటీఎఫ్ అధ్యక్షులు ఎస్ వెంకటయ్య, హన్వాడ మండల అధ్యక్షులు కిష్ట నాయక్, గండిడ్ మండల అధ్యక్షులు గంట శ్రీనివాస్, సంపత్, సాయన్న, వేణుగోపాల్వర్మ, నాగరాణి, రాజకుమారి, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.