Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం బాల్యా నాయక్
పాన్‌గల్ : గిరిజన సమస్యల సాధనే సేవాలాల్‌కు నిజమైన నివాళీ అని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం బాల్యా నాయక్ అన్నారు. ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు జరుగుతున్న సేవాలాల్ 284 వ జయంతోత్సవాలలో భాగంగా బుధవారం పాన్‌గల్ మండలం అన్నారం తండాలో తెలంగాణ గిరిజన సంఘంఆధ్వర్యంలో సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగాజిల్లా ప్రధాన కార్యదర్శి హాజరై మాట్లాడారు. బంజారాల మార్గ దర్శకుడు, గొప్ప సంఘసంస్కర్త, పోరాట యోధుడు సేవాలాల్ మహారాజ్ అని ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆశయా లను ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర ,రాష్ట్ర ప్రభు త్వాలు అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలతో పాటు ఇచ్చిన వాగ్దానాల అమలుకై పోరాడాలని పిలుపునిచ్చారు. సేవాలాల్ జయంతిని సెలవు దిన ంగా ప్రకటించాలని బంజారా గిరిజనులు గత అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయ మన్నారు. మరో 11 బీసీ కులాలను గిరిజన జాబి తాలో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడాన్ని తీవ్రంగా వ్యతిరే కించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అన్న దానం చేశారు. అంతకుముందు యువతీ యువ కులు గిరిజన మహిళలు ప్రజా ప్రతినిధులు ర్యాలీలో పాల్గొని గిరిజన సంస్కృతిని కాపాడు కోవాలని నృత్యాలు, డప్పులు, కోలాటాలు, ఆటపా టలతో గిరిజనులు చేసిన నృత్యాల ప్రదర్శనలు చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా నాయకులు , అన్నారం సర్పంచ్ రంగనాయక్, శివ నాయక్, జానకి రాములు, లాలుపతి నాయక, భాస్కర్ నాయక్, నాయక్, మహేందర్ నాయక్, భాగ్యలక్ష్మి,దేవమ్మ, లాలమ్మ, పూజారి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలి
కొత్తకోట : సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ చూపించిన మార్గం ఆదర్శనీయమని సీఎం కెేసీఆర్ కు గిరిజనుల పట్ల అపారమైన గౌరవం ఉందని, అందుకే సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారని ఎంపీపీ గుంత మౌనిక, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్ అన్నారు. బుధవారం కొత్తకోట మండలం నాటేల్లి పెద్ద తండాలో సంత్‌సేవాలాల్ మహారాజ్ 284 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్న తండా, పెద్ద తండాల నుంచి మండల కేంద్రం వరకు డీజే, నృత్యాలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బోధనలను అందరూ ఆచరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సందర్భంగా గ్రామ యువకుడు ఏం గోవిందు నాయక్ మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్ కు సేవాలాల్ మహారాజ్ ప్రతిమ గల ఫోటోను అందజేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవాలాల్ మహారాజ్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ చెన్నకేషవ రెడ్డి, వైస్ ఎంపీపీ వడ్డే శ్రీనివాసులు, జిల్లా అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్, అయ్యన్న, నాటేల్లి మాజీ సర్పంచి ఎద్దుల నగేష్, సర్పంచ్ దేవి లక్ష్మణ్ నాయక్, వినోద్ సాగర్, షకీల్, మాజీ ఎంపీటీసీ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి
వనపర్తి రూరల్ /పెద్దమందడి
టీజేఏసీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో బుధవారం గిరిజనుల దార్శనికుడు సంత్ సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ సంచార జీవితం గడిపే బంజారాలకు అద్భుత జీవన మార్గాలను బోధించి స్థిర నివాసం ఏర్పరచుకునేలా చేసి వారిలో చైతన్యాన్ని నింపి నా వ్యక్తి అని అందుకే ఆయనను బంజారాలు భగత్ స్వరూపంగా భావిస్తారన్నారు. జన చైతన్యం కోసం సమాజ హితం కోసం అంటరానితనం మూఢాచారాలు ధూమపానం, మద్యపానం, చెడువసనాలు తదితర అంశాలపై ప్రజలను అప్పటి పాలకులను సన్మార్గంలో నడిపించడానికి చేసిన బోధనల వల్ల ప్రజల్లో ఎంతో మార్పు వచ్చిందని అన్నారు. పెద్దమ ందడి మండలంలోని ముందరి తండా, చీకరుచెట్టు తండా, స్కూల్ తండాలలో సంత్ సేవా లాల్ మహ రాజ్ జయంతి వేడుకలు నిర్వహి ంచారు. ముందర తండాలో సంత్ సేవలాల్ మహ రాజ్ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం సేవా లాల్ చిత్రపటాన్ని గ్రామంలో ఊరేగించారు. ఆయా కార్యక్రమాలలో భూరోజు గిరిరాజు , నాయకంతి నరసింహ శర్మ , విభూతి ఈశ్వర్ ,రవి , డప్పు నాగ రాజు, వెంకటేశ్వర్లు, గద్వాల కృష్ణ , నాగ నల్ల చిన్న రాములు . సులిగిరి వెంకట స్వామి , రమేష్, చారి , వెంకటేష్ , సంఘనముని వెంకటయ్య రంగస్వామి, దాసరాజు , ప్రవీణ్ , విద్యార్థులు, పెద్దమందడిలో ఎంపీపీ మెఘారెడ్డి, ఖిల్లా ఘనపూర్ ఎంపీపీ కృష్ణా నాయక్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, సర్పంచ్‌లు జయంతి, రాధా కృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఐ.సత్యరెడ్డి, రమేష్ గిరిజన తండావాసులు, జిల్లా స్థాయి గిరిజన నాయ కులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.