Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలహీనపడుతున్న అమెరికన్ డాలర్
అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లో చైనీస్ యువాన్ బలంగా ఉంది. చైనీస్ కరెన్సీకి విశ్వసనీయ కరెన్సీగా పేరుంది. 1997లో ఆసియా దేశాలలో ఆర్థిక సంక్షోభం సంభవించినప్పుడు చైనా తన కరెన్సీ విలువను తగ్గించలేదు(డీవ్యాల్యు చెయ్యలేదు). దానితో ఆసియా దేశాలు ఆర్థిక సంక్లిష్టత నుంచి బయటపడటానికి చైనా మద్దతు పలికినట్టయింది. వర్తమానంలో అర్జెంటీనా, చైనా ఆర్థిక వ్యవస్థలు పరస్పర పూర్వకం(కాంప్లిమెంటరీ)గా ఉన్నాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు విస్తరిస్తున్నకొద్దీ నిలకడలేని డాలరు మారకపు విలువ ప్రమాదం నుంచి బయటపడటానికి యువాన్ ఉపయోగ పడుతుంది. అదే సమయంలో యువాన్ అంతర్జాతీయ కరణ మరింతగా బలోపేతం అవుతుంది.
నెల్లూరు నరసింహారావు
డాలర్, యూరోలపైన ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం సన్నగిల్లుతున్న స్థితిలో చైనా నుంచి అర్జెంటీనా చేసుకుంటున్న దిగుమతులకు చేయవలసిన చెల్లింపులను ఆ దేశ యువాన్‌లో చేస్తున్నది. ఈ ఏర్పాటు ఇరు దేశాలకూ లాభసాటిగా ఉంది. అర్జంటీనా అమెరికన్ డాలర్‌ను ఉపయోగించటం మానేసి చైనా నుంచి చేసుకునే దిగుమతులకు యువాన్‌లో చెల్లించటానికి అంగీకరించింది. దేశానికి అవసరమైన సరుకులను, వనరులను దిగుమతి చేసుకోవటానికి యువాన్ నిధులను నిర్వహించవలసి ఉంటుందని అర్జెంటీనా ఆర్థిక మంత్రి సర్గియో టోమస్ మస్సా తెలిపారు. ఏప్రిల్ నెలలోనే చైనా నుంచి చేసుకున్న ఒక బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులకు యువాన్‌లో చెల్లించింది అర్జెంటీనా. సగటున నెలకు చైనా నుంచి 790 మిలియన్ డాలర్ల విలువైన సరుకులను అర్జెంటీనా దిగుమతి చేసుకుంటోంది.
ఎంతోకాలంగా చైనా, అర్జెంటీనా దేశాలమధ్య స్నేహ పూర్వక సంబంధాలున్నాయి. గత సంవత్సరం అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్ చైనాలో పర్యటించినప్పుడు ఇరు దేశాలమధ్య ఒక సహకార ఒప్పందం కుదిరింది. పాక్ లాండ్ దీవులపైన అర్జెంటీనాకు బ్రిటన్‌తో ఘర్షణ జరిగినప్పుడు చైనా అర్జెంటీనాను సమర్థించింది. అర్జెంటీనా 'ఒకే చైనా' నియమానికి మద్దతు పలుకుతోంది. కాబట్టి వాణిజ్యంలో యువాన్‌లో చెల్లింపులు ఇరుదేశాల మధ్య నెలకొన్న స్నేహ సంబంధాలను ప్రతిబింబిస్తున్నాయి.
లాటిన్ అమెరికాలో మెర్కోసుర్గా పిలవబడే సదరన్ కామన్ మార్కెట్ దేశాల అంతర్జాతీయ వాణిజ్యంలో బ్రెజిల్ తరువాత అర్జెంటీనా డాలర్‌ను వీడి యువాన్‌లో లావా దేవీలు జరుపుతున్నది. డాలరు మారకపు విలువ నిలకడ లేకుండా కొనసాగుతుండగా యువాన్ ప్రాబల్యం రోజు రోజుకూ పెరుగుతున్నది. చారిత్రకంగా అమెరికా రాజకీయా లకు, ఆర్థిక వ్యవస్థకు ఆధీన పాత్రను పోషించిన ఈ మెర్కో సుర్ దేశాలు డాలర్ ఆధిపత్య క్షేత్రం నుంచి బయట పడుతున్నాయి. ఈ గ్రూపులోని మూడు దేశా ల జనాభా దాదాపు 30 కోట్లు, ఈ దేశా ల స్థూల జాతీయోత్పత్తి 2 ట్రిల్లి యన్లు. 2023 మార్చిలో విడు దలైన సమాచారం ప్రకారం 2010లో అసలు మొదలే కాని యువాన్ చెల్లింపుల వ్యవస్థ ఈ ప్రాంత విదేశీ చెల్లింపులలో 48 శాతం గా ఉంది. ఇదే కాలంలో 83శాతంగా వున్న డాలర్ చెల్లింపులు 47 శాతానికి తగ్గిపోయాయి. అర్జెంటీనా అమెరికా డాలర్ ఆధిపత్యం నుంచి బయటపడటం, అమె రికా రాజకీయ ప్రాబల్యం నుంచి బయట పడటం సమాంతరంగా జరుగు తున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిధుల లేమి కారణంగా ఏర్పడిన అర్జెంటీనా ఆర్థిక సంక్షోభం అంతర్జాతీయ ద్రవ్యనిధికి చేయవలసిన చెల్లింపులకు సంబంధించిన తగవుతో తీవ్రతరమైంది. అర్జెం టీనా యువాన్‌కు మార టంతో అర్జెంటీనా కేంద్ర బ్యాంకుపై ఒత్తిడి తగ్గింది. దీనితో అర్జెం టీనా ఇక ఏ మాత్రం కీలుబొమ్మగా ఉండదని అమెరికాకు అర్థమౌతుం ది. అంతే కాకుండా అంతర్జాతీయ ద్రవ్య నిధితో అర్జెంటీనా తీసు కున్న అప్పును తిరిగి చెల్లించటానికి చేసుకోవల సిన ఒప్పందంపైన జరిగే చర్చల్లో అర్జెంటీనా ఒత్తిడికి గురికావలసిన అవసరం ఉండదు.
ఇలా అర్జెంటీనా తన చెల్లింపులను చైనీస్ యువాన్‌కు మార్చటంవల్ల అమెరికా డాలర్‌పై ఆధార పడటం తగ్గటమే కాదు అప్పు ఇవ్వటానికి అంతర్జాతీయ ద్రవ్యసంస్థ విధించే కఠిన నియమ నిబంధనలలో కూడా గణనీయమైన మార్పు వస్తుంది. రోజురోజుకూ అంతర్జా తీయంగా డాలర్ బలహీనపడుతుండగా అమెరికా ప్రాబల్య ప్రాంతమైన లాటిన్ అమెరికాలో చైనా పెట్టుబడులు పెరుగుతున్నాయి. గత రెండు దశాబ్దాలతో పోలిస్తే రిజర్వ్ కరెన్సీగా డాలర్ 2022లో 10రెట్లు తగ్గింది. దీనికి కారణం వివిధ దేశాలు తమ వాణిజ్య లావాదేవీలను ద్వైపాక్షిక కరెన్సీలలో చేసుకోవటమే. మారకం చేసుకోగలిగిన మొత్తం ప్రపంచ కరెన్సీ రిజర్వులో 2021లో 55 శాతం వున్న డాలర్ వాటా 2022లో 47 శాతానికి తగ్గింది. 2023లో డాలర్ వాటా మరింతగా పతనం అవుతుంది. ఇలా డాలర్ ఆధిపత్య పతనంతో పాటుగా అంతర్జాతీయ రాజకీయాలలో అమెరికా ఆధిపత్యం కూడా పతనం అవుతుంది.