Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రెమ్లిన్‌పై ఉక్రెయిన్ దాడి..డ్రోన్్లను కూల్చివేసిన మాస్కో
- తమకేం తెలియదన్న కీవ్
మాస్కో, కీవ్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్న రెండు డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా బుధవారం తెలిపింది. రష్యా అధ్యక్షునిపై జరిగిన ''తీవ్రవాద'' హత్యా యత్నంగా ఈ చర్యను అభివర్ణించింది. ''రెండు మానవ రహిత వాహనాలు క్రెమ్లిన్ వైపునకు రాగా, వాటిని నిర్వీర్యం చేశాం.'' అని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బుధవారం తెల్లవారు జాములోపు ఈ ఘటన చోటు చేసుకుంది. కూల్చివేసిన డ్రోన్ భాగాలు క్రెమ్లిన్ ఆవరణలోనే పడ్డాయి. అయితే ఎవరూ గాయపడలేదని ఆ ప్రకటన తెలిపింది. పుతిన్‌ను హతమార్చేందుకు ఉక్రెయిన్ తీసుకున్న చర్యే ఇదని మాస్కో పేర్కొంటోంది. కాగా, దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది. ''క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడులతో ఉక్రెయిన్‌కు ఎలాంటి సంబంధం లేదు.'' అని అధ్యక్ష భవన ప్రతినిధి మిఖాయిల్ పొడొలాక్ స్పష్టం చేశారు. ఇదొక ప్రణాళిక ప్రకారం అమలు చేసిన తీవ్రవాద చర్య అని రష్యా అంతకుముందు వ్యాఖ్యానించింది. బుధవారం పుతిన్ తన నివాసంలో పనిచేసుకుంటున్నారని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.