Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుర్రమ్: పాకిస్తాన్లో అత్యంత సున్నితం గా వుండే వాయవ్య ప్రాంతంలో ఒక స్కూలుని చుట్టుముట్టిన సాయుధులు ఏడుగురు టీచర్లను మట్టుబెట్టారు. విడిగా జరిగిన మరో దాడిలో అదే స్కూలుకి చెందిన మరో టీచర్ మరణించి నట్లు అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌కు సరిహద్దుల్లో వాయవ్య ఖైబర్ ఫక్తూన్‌ఖవా ప్రావిన్స్‌లోని జిల్లా అయిన కుర్రమ్లో మంగళవారం కొంతమంది సాయుధుల బృందం ప్రభుత్వ పాఠశాలను చుట్టుముట్టి ఏడుగురు టీచర్లను హతమార్చింది. ఆ సమయంలో విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నారు. కాగా, చనిపోయిన ఏడుగురు టీచర్లు షియా కమ్యూనిటీకి చెందినవారే. అదే రోజు కుర్రమ్లో రోడ్డుపై జరిగిన మరో దాడిలో సున్ని ముస్లింకి చెందిన మహిళ చనిపోయారు. ఈ దాడులకు తమదే బాధ్యత అని ఇంతవరకు ఏ సంస్థ ప్రకటించలేదు. ఈ రెండు సంఘటనలకు సంబంధముందా లేదా అన్నదికూడా తెలియరాలేదు.