Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : మార్చి29 నుంచి ఏప్రిల్ 1వ తేదీదాకా మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రాహిం చైనాలో పర్యటించాడు. ఈ పర్యటన లో మలేషియాలో చైనా పెట్టుబడుల గురించి అనేక ఒప్పందాలు జరిగా యి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా సైనికంగాను, ఆర్థికంగాను చైనాకు వ్యతిరేకంగా కాలుదువ్వుతున్న స్థితిలో మలేషియా ప్రధాని చైనా పర్యటన ఆసక్తిదాయకంగా ఉంది. మలేషియాలో పెట్రోకెమికల్, ఆటోమోటివ్, ఫైనాన్స్, తదితర రంగాలలో పెట్టుబడులు పెట్టటానికి చైనాలో 19 మెమొరాండా ఆఫ్ అండర్స్టాండింగ్స్ (ఎమ్ఓయుల)పైన అన్వర్ సంతకాలు చేశాడు. అదే సమయంలో అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న ఘర్షణలో తన దేశం తటస్థంగా ఉంటుందని మలేషియా ప్రధాని ప్రకటించాడు. ఈ ఎమ్ఓయుల విలువ 170బిలియన్ యువాన్లు(38.5బిలియన్ డాలర్లు) ఉంటుంది. ఈ పెట్టుబడులు మలేషియా స్థూల జాతీయోత్పత్తి(జిడిపి)లో 10శాతంతో సమానం. రాబోయే రోజుల్లో మలేషియాలో చైనా పెట్టుబడులు అనేక రెట్లు పెరగనున్నాయి.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనాతోవున్న సరిహద్దు తగాదాను పెంచ కుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి మలేషియా సంసిద్దంగా ఉందని అన్వర్ సూచించాడు. దక్షిణ చైనా సముద్రం, తైవాన్ సమస్యలతో పాటు అనేక విషయాలపై అమెరికా చైనాపై యుద్ధానికి కాలుదువ్వుతున్న స్థితిలో మలేషియా వైఖరి గురించి ప్రధాని అన్వర్ ప్రకటించటానికి ప్రాధా న్యత ఏర్పడింది. అన్వర్ చైనా పర్యటనలో అత్యున్నత స్థాయి ప్రతినిధి వర్గం పాల్గొంది. అన్వర్ బృందం 36 మంది చైనీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌తో రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొంది. మలేషియా-చైనా బిజినెస్ ఫోరమ్ సమావేశంలో 1000 మందికి పైగా ఇరు దేశాల బిజినెస్ ప్రతినిధులు పాల్గొ న్నారు. 2009 నుంచి చైనా మలేషియాకి అత్యున్నత స్థాయి వాణిజ్య భాగ స్వామిగా ఉంది. 2022లో మలేషియాకి, చైనాకి మధ్య 110.6 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. అలాగే 2022లో మలేషియాలో చైనా అత్యంత అధిక స్థాయిలో 12.5బిలియన్ డాలర్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి పెట్టిన దేశంగా ఉంది. చైనా, సింగపూర్ తరువాత మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా ఉండటం ఇక్కడ గమనించవలసిన విషయం.
మలేషియా ప్రధాని అన్వర్ చైనా పర్యటనలో జరిగిన ఒప్పందాల మొత్తం 170బిలియన్ యువాన్లలో 80బిలియన్లు సింగపూర్ కి సమీపంలోని జోహౌర్లో ని రోంగ్షెంగ్ పెట్రోకెమికల్ కంపెనీలో పెట్టటం జరుగుతుంది. 32బిలియన్ యువాన్ల పెట్టుబడి చైనా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ జెజియాంగ్ గీలీ పెరాక్ రాష్ట్రంలో పెట్టబోయే ఫ్యాక్టరీలో పెట్టటం జరుగు తుంది. ఇలా మలేషియా లో చైనా పెట్టుబడులు ప్రవహిస్తుంటే అమెరికా చూస్తూ ఊరుకోదు. ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో మలేషియా చైనా సహకారం తీసుకుంటే అనివార్యం గా మలేషియాపై అమెరికా ఒత్తిడి ఉంటుంది. చైనా, అమెరికాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణంలో మలేషియా ఇరుదేశాలతో సత్సంబంధాలను కొనసాగిం చటం కత్తిమీద సామే అవుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ సంబంధాలలో చైనా ప్రతి కదలికనూ తన ప్రపంచ ఆధిపత్యంపైన దాడిగా అమెరికా భావిస్తోంది.