అంతరంగం
''ఎవరికి ఎవరు. చివరికి ఎవరు? ముగియని ఈ యాత్రలోన, ముగిసే ఈ జన్మలోన'' అనే రామకృష్ణ పాడిన సినీ గీతం తాత్విక ధోరణిలో వున్నప్పటికీ ఈనాటి కరోనా కాలంలో చివరి వీడ్కోలుకు ఎవరు మిగులుతున్నారనేది ఒక ముఖ్యమైన విషయంగా మారింది. చనిపోవడం అనేది సాధారణమైన విషయమే.
'మనసారా కడుపారా ఏడ్వనీయుడు నన్ను' అని కృష్ణశాస్త్రి గారు ఏడ్చే స్వేచ్ఛను కోరుకున్నారు. ఏడ్వనీయండని వేడుకున్నాడు. 'ఏడ్చిన కళ్ళ వెనుక కల్మషము తొలగు' అన్నాడొకాయన. 'పతితులారా భ్రష్టులార! ఏడవకండేడవకండీ' అని ఏడ్చే వా
సంక్షోభాలు, సంక్లిష్ట సమయాలు కొన్ని వాస్తవిక విషయాలను తేటతెల్లం చేస్తాయి. కొందరికి సంక్షోభాలు కూడా లాభాలు తెచ్చి పెడతాయి. అయితే ఈ కరోనా విజృంభణ సందర్భంలో, గ్రామీణం నుండి పట్టణాలు, నగరాల వరకు పొద్దుట లేస్తే మహా మహా శక్తుల గురించి, మహత్తుల గురించి త
ఖాళీలు పూరించుమూ అని చిన్నప్పుడు బడిలో పరీక్షల్లో ప్రశ్నలుండేవి. విద్యార్థులు సరైన పదాలతో ఖాళీలను పూరించేవారు. ఇప్పుడు ఖాళీలు అవి కాదు. అలా ప్రశ్నలా ఎదురైనా పూరించే పదాలు, అర్థాలు, జవాబులు ఇక్కడేమీ లేవు.
వార్తల కోసం ఉదయాన్నే పత్రిక వెతుక్కోవడం సాధారణంగా మనకుండే అలవాటు. వార్తలు చదవడానికి ఎందుకంత ఉత్సాహాన్ని చూపిస్తమంటే, ప్రపంచం మాట్లాడుతుంది వార్తలో. ప్రపంచంతో మనకు వున్న సంబంధపు అనుబంధమే మనల్ని అటువైపుగా లాక్కెలుతుంది. వార్తయందు జగతి వ
మృత్యుహేలతో దేశం వణికిపోతోంది. భయానక పరిస్థితులలో దేశ ప్రజలు విలవిల్లాడుతున్నారు. రాజధాని ఢిల్లీ నుంచి దేశపు నాలుగు దిక్కుల్లోను కరోన విజృంభణతో జనులు పిట్టల్లా రాలిపోతున్నారు. బ్రతికున్న వాళ్ళంతా ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాక బిక్కు బిక్కు మని బ్రతు
'ముసలివాణ్ణి కాదు నేను అసలు వాణ్ణి, ఆకాశాన్నందుకున్న కొసలవాణ్ణి' అని శ్రీశ్రీ ఎప్పుడో చెప్పుకున్నాడు. ముసలితనం, ముసలివాళ్ళను మనం ఎలా చూస్తున్నాము అనే దాన్ని బట్టి మన సామాజిక విలువలు, మానవ సంబంధాలు ఎలా వున్నాయో చెప్పవచ్చు. ముసలితనం అనేది అందరికీ ఎద
ఒక సంవత్సరం గడిచిపోయింది ఈ కరోనా మనల్ని వెంటాడటం మొదలుపెట్టి. మధ్యలో కొంత తగ్గుముఖం పట్టినట్లు కనపడ్డా, ఇప్పుడు తిరగబెట్టింది. ప్రపంచమంతా ఎంతో అల్లకల్లోలం చెలరేగింది. లక్షల మందిని కబళించింది. కోట్లాది మందిని మానసిక,
ఏదైనా పెరుగుతుండడం అంటే మంచిదే అనుకుంటాము. ఇది దిగజారడంలో పెరగడం. అంటే ముందుకు పోవాల్సింది వెనక్కి వెనక్కి పడిపోతున్నాం. స్త్రీ పురుషుల మధ్య అసమానత మరింత పెరిగిపోతుండటం సామాజికులకు ఆందోళన కలిగించే అంశం. ఈ అసమానతలు తీవ్రమైన సామాజిక సమస్యలకు కారణంగా