అంతరంగం
ఈ దేశం గర్వించేలా చేయడానికి లింగభేదాలు అడ్డురావు. మత భేదాలూ ప్రాంతాలు, కులాలు ఏవీ ఆటంకంగా నిలబడజాలవు. ఈ నేలపైన పుట్టిపెరిగిన ఎవ్వరయినా అకుంఠిత దీక్షతో శ్రమతో క్రమశిక్షణతో తాము ఎంచుకున్న మార్గంలో కృషి చేస్తూపోతే, ఫలితాలు పొందుతారు. అప్పుడు ఈ నేల నే
'తిండి కలిగితె కండ కలదోరు, కండ కలిగినవాడె మనిషోరు' అని అప్పుడెప్పుడో గురజాడ మహాకవి పాడుకున్నాడు. మనిషికి ప్రాథమికావసరం తిండే. 'కోటి విద్యలూ కూటి కొరకే' అని ఊరకనే అనలేదు. ఎంత తెలివై
'చుట్టూ పదిమంది వున్నారు. పది మంది కాళ్లూ పట్టుకన్నాను. కాపాడమని, వాళ్ళతోనూ మొరపెట్టుకున్నాను. ఎవరూ నా దీన వేడుకోలును వినిపించుకోలేదు. ఇప్పుడెందుకు వస్తున్నారు? ఎవరైనా నాగరాజును తీసుకొస్తారా! ఛీ! సమాజం మీద ఉమ్ముతున్నాను!' కన్నీళ్లు గుండెల్లోంచి ఉబ
అనేక భాషలు, తెగలు, మతాలు, సమూహాలు, సంస్కృతుల సహజీవన మణిహారం భారతం. తరాలుగా సాగిపోతున్న సహన జీవనంలో, ఇప్పుడు అనేక వైశమ్యాలు, విద్వేషాలు గొచ్చగొట్టబడుతున్నాయి. అందులో భాష కూడా
భవితను ముందుకు నడిపే దృష్టి వున్నవాడే నాయకుడవుతాడు. భవిత అంటే యువతనే. మన దేశంలో యువతరంగం సమృద్ధిగానే వుంది. నడపమంటే చేయి పట్టుకు నడపటం కాదు. ముందుకు పోగల, అభివృద్ధి చెందగల ఆలోచనలు ఇవ్వటం
కాలం వెనుతిరుగుతోందా! మన కాలు వెనక్కి మళ్ళిందా? ఏదో వెనక్కి నడుస్తున్నట్టుగా తోస్తున్నది. చీకటిలోకో, చిద్రగుహల్లోకో అడుగులేస్తున్నట్లు.... ఆలోచనలన్నీ శిథిల చరితల నీడన త
చదువెందుకో విజ్ఞానాన్ని పెంపొందించడం లేదు. శాస్త్రీయ ఆలోచననూ కలిగించడం లేదు. కనీస విచక్షణాజ్ఞానాన్నీ ఇవ్వడం లేదు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్లు, పెద్ద పెద్ద పదవుల్లో వున్న వాళ్ల సంగతే ఇలా ఉం
ఎన్నికల రుతువు ముగియగానే ఆరంభమయ్యే రుతువు ధరల రుతువే. ఆకాశంలోని చుక్కలను కూడా దాటిపోతున్న ధరలు. వీటికి అంతం లేదు. అదుపూ లేదు. మొన్నటి వరకూ అంటే, వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నపుడు, ఒక మూడు నెలల కాల
బేటీ బచావ్ అంటే కాపాడుకోవాలి అని కదా! హత్రాస్‌లో కాపాడుకోలేకపోయాం, ఉన్నావ్‌లోనూ కాపాడబడలేదు. కతువాలో కాపాడుకోలేదు. ఇంతేకాదు, దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్న అత్యాచారాలను, హత్యలన
కవిత్వానికి ఒక రోజు పెట్టుకుని, కవిత్వాన్ని పఠించి, ఆస్వాదించి ఆనందించడం ప్రపంచమంతా జరగాలని కోరుకోవడమే ఓ పెద్ద ముందడుగు. నిత్య కవన సృజనకారులు ఎలాగూ ఉండనే వున్నారు. ప్రేమికుల రోజు, మహిళల రోజు, కార్మికుల రోజు, తల్లుల ర
గెలుపు అనేది కొండంత ఉత్సాహాన్ని ఇస్తుంది ఎవరికైనా. అసలు గెలవటం అంటే ఏమిటో నిర్వచించుకోవాలి మనం. ఏ పోటీ లేకుండానే ఒక్కో సారి మనం గెలుపు ఉత్సాహాన్ని , ఆనందాన్ని పొందుతుంటాము. గెలుపున
అసలు ఈ యుద్ధ పిపాస ఎందుకు తలెత్తుతున్నది? ఏమిటి దీనికి మూలం? ఎక్కడుంది దీని అసలు సారం? పెట్టుబడి విస్తరణే యుద్ధకాంక్షను ఉసిగొల్పుతుంది. ఆక్రమణలకు, ఆధిపత్యానికీ వ్యాపారలాభాలే ఛోదకశక్తులు. యుద్ధ పరి
యుద్ధాలకు మూలాలు ఆధిపత్యాలే. ఆధిపత్యం ఎందుకంటే దోపిడీ కోసమే. ఇప్పటికి జరిగిన ప్రపంచ యుద్ధాలు, వివిధ సందర్భాలలో దేశాల మధ్య జరిగిన యుద్ధాలు అన్నీ పెట్టుబడి లాభాల దాహాలే కారణాలు. భౌతిక సంపదలను దోచుకోవడం, సంపద సృష్టించే ప్రజలను దోచుకోవడం, స్థూలంగా యుద
'ఆత్మశుద్ధిలేని ఆచరమదియేల/ భాండశుద్ధిలేని పాకమేల!/ చిత్తశుద్ధిలేని శివపూజలేలరా/ విశ్వదాభిరామ వినురవేమ!' అని ఎంతో విడమర్చి చెప్పాడు వేమన. ఈ సూక్తి ఆసాంతం మన చినజీయరు స్వామికి చెప్పినట్లే అనిపిస్తుంది. ఈ నెల రెండో తేది నుంచి ముచ్చింతల్‌లో రామాన
కట్టు బొట్టు, వస్త్రధారణ, ఆహార సంప్రదాయాలు, మన దేశంలో అనేకరకాలుగా వున్నాయి. ముఖ్యంగా ఆహార్యం రాష్ట్రానికోతీరు, ప్రాంతానికోతీరుగా వుంటుంది. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతపు వేశ ధారణతో కనపడే మన ప్రధాని మోడిగారిని చూస్తే ఎంత వైవిధ్య ఆహార్య సంప్రదాయమో
బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ప్రభుత్వాలకు సహజమైన విషయం. బడ్జెట్ విషయాలు ఆర్థిక నిపుణులకే తెలుస్తాయి కానీ సామాన్యులకు ఏమి అర్థమౌతాయి అని కొందరనుకుంటారు. కానీ అది నిజం కాదు. ప్రతి కుటుంబానికి, కుటుంబ పెద్దలకు, నిర్వాహకులకు తెలియని విషయమేమ
'మూఢనమ్మకాలు ఎప్పుడయితే మన తలలోకి చేరితే, అప్పుడు మన మెదడు తల నుంచి తొలగిపోతుంది' అని సంఘసంస్కరణా ఆధ్యాత్మకుడు స్వామి వివేకానంద సెలవిచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే మెదడులేని మాటలను మనం వింటున్నాము. వింటూనే ఖాళీతలలూపుతూనే వున్నాము. అంత అచేతనాపరులంగా మ
గీమద్దెల కేరళ రాష్ట్రాన సదువుకునే బళ్ళలో ప్రార్థన చేసేపుడు పోరగాళ్ళ చేత రాజ్యాంగంలో వున్న ముందు మాటను సదివిస్తోన్లంట. అరె గిప్పుడెందుకు గిది. దీనవసరమేమొచ్చిందీ అని నాకో అనుమానమొచ్చి సొచాయించా! మనకు సొతంత్రం వొచ్చి డెబ్బయి ఐదేండ్లు కావొస్తుండె. గిప
నువ్వెక్కడికి వెళ్ళినా నిను వెంబడిస్తూనే వుంటా అన్నట్టుగానే కరోనా వైరస్ రకరకాల అలంకరణలతో మనల్ని వెంటాడుతూనే వుంది. ఆరంభంలో గడగడలాడించిన మహమ్మారి లక్షలాది ప్రాణాలను బలితీసుకుంది. రెండేండ్లూ భయం గుప్పిట్లోనే గడిచిపోయాయి. తన వేశం మార్చుకుని డెల
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మనమేమయినా మారిపోయామా! పోనీ మన ఆవరణం, స్నేహితులు, చెట్లు, పుట్టలూ, పనులూ పాట్లూ, భయాలు, నిర్భయలు ఏవైనా మారాయా? చూపులో, ఆలోచనలో, నడకలో, నలతలో ఏమైనా మార్పులొచ్చాయా? అబ్బే ఏమీలేదు. అన్నీ యధావిధిగానే వున్నాయి.
&n
కాలం వెనకాల పెద్దకతేవుంది. అంతుపట్టనిది, చిక్కనిదీ కాలం. దానికంటూ ఓ రూప స్వభవాలు వేరుగా ఏమీవుండవు. స్టీఫెన్హాకిన్స్ మహాశయుడు కాలబిలాల గురించి రాసాడు గానీ అదంతా ఓ వైజ్ఞానికి తాత్వికాంశం. సాధారణంగానైతే మూడు కాలాలు మనకు. ఎండాకాలం, వానాకాల
దేవున్ని కొలుస్తూనో, స్మరిస్తూనో ఉండటాన్ని జపం అంటారు. మరి ఈ కొంగజపమేమిటి అనే సందేహం మనకేమీకలగదు. ఎందుకంటే కొంగజపం కథ మనందరికీ తెలుసు. అయినా ఆ కథను స్మరించుకొనేలా మన నేతల చేతలు కనపడుతుంటాయి. పూర్వము ఓ వద్థ కొంగ, చెరువు వొడ్డున రాతి మీద ఒంటి కాలిత
మోసం జరుగుతోంది అంటే, మోసం చేసేవాళ్ళు, మోసానికి గురయ్యే వాళ్ళు వున్నారని అర్థం. సమాజంలో మోసాలు జరుగుతాయని మనమందరం అనుకుం టాము. అంటే మోసాలు జరిగే సమాజంలోనే మనమున్నామని అర్ధం. మోసం చేయాలనే తలంపు ఒక మనిషికి ఎందుకు వస్తుంది. తనకు తానుగానే పొందే మానసిక
అంతమొందించగల శత్రువు కంటే పెద్ద శత్రువు మనలోవుండే భయం. భయం కలిగి వుండటమే అత్యంత భయంకరమైన విషయం. భయభక్తులు కలిగివుండాలని, అట్లా వున్న వాళ్ళను మంచి మనుషులుగా మర్యాద మనుషు లుగా యెంచి చూడటం సంప్రదాయంగా చెప్పుకునే విషయాలు, భక్తి వుంటే వున్నది. భయమెందుక
'ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదులెమ్ము / నరుడు నరుడగుట ఎంత దుష్కరము సుమ్ము'' అన్నగాలిబ్ గీతాన్ని మన దాశరథి తెలుగులో మనకందించారు. అవును కదా ఏదీ సులభంగా సాధ్యంకాదు. ఎంతోకొంత పరిణామం, పరిమాణం జరిగిన పిమ్మటనే కొన్ని సంఘటనలు సంభవిస్తుంటాయి. మనం జరిగ
మూర్ఖులు తమ అజ్ఞానంతో, సంకుచిత అభిప్రాయాలతో కచ్చితంగానే ఉంటారు. వివేకులకే అనేక సందేహాలుంటాయని ప్రముఖ తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ అంటారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరికివారు తీర్పులు చెబుతున్న వైనం చూస్తే ఆ మాట ముమ్మాటికీ నిజమనిపిస్తుంది.
పిల్లల్లాంటి హృదయం వుంటే ఎంత బావుండు కదా! అని అనిపిస్తూ వుంటుంది. ఆ దశను దాటి వచ్చాక కూడా అదే గొప్ప హృదయమని అనుకుంటున్నామంటే ఇప్పుడు కలుషితమయిందనే అర్థం. కలుషితం కావటం అంటే అనేకానేక అవసరాలు, స్వార్థాలు, ఆలోచనలు, ఆవేశాలు, కోరికలు, ఈర్ష్యలు అసూయలు ఇ
సినిమాల్లో హీరోలు ఎన్ని మంచిపనులు చేస్తారో లెక్కేవుండదు. నలభై యేండ్ల నుంచి సినిమాలు చూస్తున్న అన్ని సినిమాల్లోనూ హీరోలు బలవంతులు, బుద్ధిమంతులు, విశాల హదయులే వుంటారు. ఈ మధ్య ప్రపంచీకరణ మొదలయ్యాక 'ఇడియట్స్', 'రాస్కెల్స్', 'దొంగ'లు వుంటు
సంతోషంగా జీవితాన్ని గడపాలి అంటారు అందరు. సంతోషం వెళ్లివిరిసినప్పుడే ఆరోగ్యమూ చేకూరుతుందనీ అంటారు. సంతోషంగా ఉండాలన్న కోరిక అందరిలోనూ వుంటుంది. 'అదిగో చూడండి ఆ కుటుంబంలో ఎప్పుడూ సంతోషం కనిపిస్తుంది'. అని చెప్పుకొంటాం. ముఖాన్ని చూడగానే సంతోషంగా వున్న
భార్య.. భర్త
తల్లితండ్రులు.. పిల్లలు
అన్నదమ్ములు.. అక్కాచెల్లెళ్లు
కొడుకులు.. కోడళ్లు
కూతుళ్లు.. అల్లుళ్లూ
అత్తలు.. మామలు
పిన్ని.. బాబారు
ఇలా ఎన్నో బంధాలు అనుబంధాలు. అందరి మధ్
సినిమా రంగంలో పని చేస్తున్న నటులు, సహాయ నటులు, సంక్షేమం కోసం ఏర్పడిన 'మా' సంఘానికి జరిగిన ఎన్నికలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆరోపణలు, వివాదాలు, విద్వేషాలు, ఆఖరికి కుల, మత, ప్రాంత భేదాలు
'హైజాక్ అనే మాటకు అర్థం మనకు తెలుసు. ఒకప్పుడు విమానాలను ఉగ్రవాదులు దారి మళ్ళించి తమ ఆదీనంలోకి తీసుకుని, తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాలను కోరేవారు. హైజాక్ అనగానే గుర్తుకొచ్చేది అదే. అంటే ఎత్తుకెళ్ళి తమ ఆదీనంలో, చెప్పు చేతుల్లో వు
'రైట్ టు సిట్' ఉద్యమం ...
పది, పన్నెండు గంటలు
నిరంతరంగా నిలుచోవటం,
పని చేయటం అంటే కనీస
మానవీయత లేని
పరిస్థితులను
'అలవాటైపోతుంది ప్రతిదీ. రోజూ చేస్తూ వున్నా, రోజూ చూస్తూవున్నా, సామాన్యమై పోతుంది. నేరమైనా ఘోరమైనా మానవత్వం రోజుకింత కరిగిపోతూనే ఉంది.మనిషి కొద్ది క్కొద్దిగా తరిగిపోతూనే వున్నాడు' అన్నట్టుగానే దిగజారి పోతున్నాడు. అంతేకాదు దుర్మార్గమై పోతున్నాడు అని
నేరములు అనే మాట ఇప్పుడందరికీ తెలిసిన మాటే. ఇంగ్లీష్‌లో దీన్నే 'క్రైమ్' అంటాము. తప్పు, అపరాధము, అన్యాయం, దోషం, అపచారం, దుష్టత్వం, దుర్మార్గం... ఇంకా ఎన్నో మాటలున్నాయి. ఏవైతే చేయగూడని పనులు, ఇతరులకు హాని కలిగించేవి, నష్టపరిచేవి, హతమార్చేవ
ఉత్సవాలు, జాతరలు అంటే ఎవరికైనా ఉత్సాహంగానే వుంటుంది. ఎందుకంటే రెండింటిలోనూ సమూహపు చలనం వుంటుంది. జాతరలు గ్రామీణ వాతావరణానికి సంబంధించినవి. ఉత్సవాలు పట్టణ, నగర జనుల సంప్రదాయాలు. దేవుడు, దేవతల పేరుతో కొనసాగేవే ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇంకొన్ని వారోత్
జీవితంలో తరగతి గది ఒక మధుర జ్ఞాపకం. తరగతి గది కేవలం పాఠాల ఆవరణే కాదు, చిన్న సమాజమంతటి అనుభూతిని, అనుభవాన్ని ఇచ్చే నెలవు అది. గది భౌతికం. నాలుగు గోడలు, కిటికీలు, తలుపులు అన్నీ ఎప్పటిలానే వుంటాయి. ఎన్ని తరాలు కదిలిపోతాయి ఆ ప్రదేశం నుండి. ఎన్ని తలపుల
చాలా రోజుల తర్వాత సెప్టెంబరు మాసారంభాన బడిగంటలు మోగుతున్నాయి. ఇది ఒకింత పిల్లలకు సంతోషం కలిగించే అంశమే. తల్లి దండ్రులూ అందుకు సుముఖంగానే వున్నారు. బడికి పోవాలంటే ఇబ్బంది పడుతూ ఏడ్పులందుకునే పిల్లలు, బడి ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూడటం ఒక విచిత
మనతోపాటుగా పుట్టిన ఆడకూతురిని తోబుట్టువు అంటారు. తోడ పుట్టిన వారి మధ్య వుండే సంబంధాలు ఇప్పటికీ అత్యంత ప్రాముఖ్యం గలవిగానే కొనసాగుతున్నాయి. అయితే మానవ సంబంధాలలో వచ్చిన మార్పుల ప్రభావాలు వీటిపై కూడా పడకుండా ఎలా వుంటాయి. వెనకట ఆడపిల్లను ఇంట్లో అందరూ
'యువతరం శిరమెత్తితే... నవతరం గళమెత్తితే... లోకమే మారిపోదా! చీకటే పారిపోదా!' అంటూ మా యువ వయస్సులో పాడుకున్నాము. ఆగస్టు 12 యువకుల దినోత్సవమని తెలియగానే నలభై యేండ్ల క్రితపు వయసులోకీ ఒక మారు తొంగి చూసుకుంటున్నాను. అవును! యువకులు ఏదైనా చేయాలనుకుంటే అడ్
'స్నేహమేరా జీవితానికి, వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటల నీడనిచ్చే మల్లెరా!' అని కవి హాయిగా స్నేహాన్ని గూర్చి పాడతాడు. నిజంగానే స్నేహం అంత గొప్పది చల్లనిదీ. స్నేహాన్ని చవిచూడని వారు వుండరన్నది నిజం. స్నేహానికి పునాది ఇరువురి అభిప్రాయాలు,
బంధువులంటే మన కుటుంబంతో సంబంధమున్న వ్యక్తులు, అత్త, మామ, పిన్ని, బాబాయి, పెదనాన్న, పెద్దమ్మ ఇలా ఎవరైనా కావొచ్చు. వీళ్ళు కూడా ఇంతక్రితం కుటుంబ సభ్యులుగానే వున్నారు. కానీ ఒప్పుడు బంధువులనే అంటన్నాము. ఇది వేరే విషయం. మన రక్తంతో సంబంధమున్న వ్యక్తుల పర
''ఆకాశంబున నుంచి శంభుని శిరం, బందుండి శీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబు నందుండి యస్‌తో కాంబోధి, పయోధి నుండి పవనాంధో లోకమున్ జేరె గంగా కూలంకష! పెక్కుభంగులు వివేక భ్రష్టసంపాతముల్'' అన్నాడు శతక కర్త. ఒక్కసారి దిగజారటం మొదల
బోనాల పండుగొచ్చిందంటే ఊరంతా సందడి సందడిగా మారిపోతుంది. సందడి అంటే మనుషులు కూడటం, దేవతకు నైవేద్యం పెట్టడం, డప్పు కొట్టడం, పసుపూ కుంకుమలు పూదిచ్చి, వేప మండలు కట్టి కడవలను తలపై పెట్టుకుని గుంపులు గుంపులుగా స్త్రీలు పురుషులు అమ్మోరు ఆలయాలకు వెళ్ళడం, క
'ఎవడు బ్రతికెడు మూడు యాభైలు!' అని కవిగారు అన్నారు గానీ బతకడమంటే, వారిచ్చిన చైతన్యం వందలేండ్లూ కొనసాగితే దాన్నే అమరత్వం అంటాం. బుద్ధుడు ఇప్పుడు భౌతికంగా లేడు కానీ ఇన్ని వందల యేండ్ల తర్వాత కూడా ఆయన చెప్పిన మాటల్ని, చూపిన మార్గాలను స్మరిస్తూనే స్ఫూర్
ప్రపంచంలో వాళ్ళెక్కడున్నా సరే వాళ్ళకు చేతులెత్తి మొక్కాల్సిందే. తెల్లని వస్త్రధారణే కాదు, హృదయాలూ స్వచ్ఛమైన తెలుపే. లేకుంటే తమ ప్రాణాలకు ముప్పు పొంచి వుందని తెలిసినా, ఎప్పుడు ఏ ప్రమాదం ఎదురై కనుమరుగై పోతామో అనే భయాలనూ వీడి, ధైర్యంగా రోగుల ప్రాణాలన
Rain rain go away అని ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కాన్వెంట్లలో నేర్పిస్తున్నారిప్పుడు. అంటే ఓ వర్షమా వెళ్ళిపో వెళ్ళిపో.. అని. మేమయితే చిన్నప్పుడు 'వానా వానా వల్లప్పా' 'వానల్లు కురవాలి వానదేవుడా' అని తెలుగులో పాడేవాళ్ళం. పాశ్చాత్య దేశాల్లో వాతావరణం చల్
'ఇప్పుడు ఇక్కడ బావీలేదు, బావిలోకి తొంగి చూసే పొన్నాయి చెట్టూ లేదు, చెట్టు పక్కన గాబూ లేదు, గాబు పక్కన అంట్లు తోమే పదేళ్ళ పిల్లాడూ లేదు- పొద్దుటి పూట కళ్ళాపి చల్లిన తడి వాకిటి మీద వేల వేల ఇంద్ర ధనస్సులు ఒక్కసారి కదలాడుతున్నట్టు నృత్యం చేసే నెమలీ లే
మనుషుల శక్తితోనే దూరాలను గెలుచుకునే మొదటి ఆధునిక వాహనం సైకిలు. జూన్ మూడు ప్రపంచ సైకిలు దినోత్సవాన్ని జరుపుకోవాలని 2018లోనే యు.ఎన్.వో ప్రకటించింది. సైకిలు గురించిన జ్ఞాపకాలన్నీ చిన్ననాటి కాలంలోకి తీసుకుపోతాయి. సైకిల్ అనేది ఒక కాలా