Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ1లో రూ.6,659 కోట్ల లాభాలు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 19.58 శాతం వృద్ధితో రూ.6,658.62 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,568.16 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ1లో కంపెనీ నికర వడ్డీ ఆదాయం 17.80 శాతం వృద్ధితో రూ.15,665.40 కోట్లకు చేరింది. అడ్వాన్స్‌లు 20.9 శాతం, డిపాజిట్లలో 24.6 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. కాగా మొండి బాకీల కోసం కేటాయింపులు 48.89 శాతం పెరిగి రూ.3,891.52 కోట్లకు ఎగిశాయి. 2020 జనవరి త్రైమాసికంలో స్థూల నిరర్ధక ఆస్తులు 1.26 శాతంగా ఉండగా.. జూన్ త్రైమాసికంలో 1.36 శాతానికి పెరిగాయి. శుక్రవారం సెషన్లో బిఎస్ఇలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ 3.46 శాతం పెరిగి రూ.1,099.15 వద్ద ముగిసింది.